వందల కొద్దీ సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఎక్కువగా జనాలకి హీరో హీరోయిన్లు మాత్రమే గుర్తుంటారు. కానీ తమ యాక్టింగ్ తో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకునే కేరక్టర్ ఆర్టిస్టులు, విలన్స్ కూడా కొందరు ఉంటారు. అలాంటి వారిలో ఈగ చిత్రంలో విలన్ గా నటించిన కిచ్చా సుదీప్ కూడా ఒకడు. శాండల్ వుడ్ లో టాప్ హీరోల్లో ఒకడైన సుదీప్.. ఇప్పుడో క్రేజీ ప్రాజెక్టుకి సైన్ చేశాడు.
'రాయ్' అనే మూవీలో సుదీప్ నటించబోతున్నాడు. రీసెంట్ గా కిల్లింగ్ వీరప్పన్ తో తిరుగులనే విజయం సాధించిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనికి దర్శకత్వం వహించనుండగా.. కన్నడ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న సినిమాగా 'రాయ్' రికార్డు సృష్టిస్తోంది. 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీయనున్న ఈ మూవీకి.. గ్యాంగ్ స్టర్ ముత్తప్ప రాయ్ జీవిత కథ ఆధారం. ఈ మూవీలో సుదీప్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. బాలీవుడ్ లోని ఓ టాప్ లీగ్ హీరోయన్ ని శాండల్ వుడ్ కి తెస్తున్నారట.
ఇప్పటికే ఆ బాలీవుడ్ హీరోయిన్ ని అడగడం, సుదీప్ తో చేసేందుకు ఆమె ఓకే చెప్పేయడం కూడా జరిగిపోయాయని అంటున్నారు. ఇందులో గ్యాంగ్ స్టర్ భార్య పాత్రలో ఆ బాలీవుడ్ బ్యూటీ నటించనుంది. ప్రస్తుతం వంగవీటి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వర్మ.. అది పూర్తి కాగానే 'రాయ్' ను స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.