తన ట్వీట్లతో సంచలనాలు సృష్టించే వర్మ.. మరోసారి అలాంటి ట్వీట్లే చేశాడు. ఈసారి అవి చేసింది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై!! ఏవో నెగెటివ్ గా చేశాడని అనుకోకండి.. పాజిటివ్ గానే!! ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవబోతోంది. బాక్సాఫీస్ పై తన పోలీస్ ప్రభావం చూపేందుకు సర్దార్ సిద్ధమైపోయాడు. మరి ఇలాంటి సమయంలో రాంగోపాల్ వర్మ ఊరుకుంటాడా? మరోసారి తన చేతికి పని చెప్పాడు.
మరో రెండు రోజుల్లో సమ్మర్ హీట్ పీక్స్ కు వెళ్లబోతోంది. బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్(పీకే) సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ (ఎస్ జీ ఎస్) సృష్టించబోతోన్న ప్రభంజనంతో.. ఇప్పుడు అందరి నోటా ఇదే మాట! తెలుగు - హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 వేల స్క్రీన్ లపై ఉగాది రోజున థియేటర్లలో సందడి చేయబోతున్నాడు సర్దార్. తెలుగు సినిమా చరిత్రలో భారీ స్థాయిలో విడుదలవుతున్న రెండో చిత్రంగా ఈ సినిమా రికార్డులకెక్కబోతోంది.
ఓవర్సీస్ లో దాదాపు 800 స్క్రీన్లు - హిందీలో మరో 800 స్క్రీన్లలో ప్రదర్శించేందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక తెలుగులో రెండున్నరవేల పైచిలుకు స్క్రీన్లపై సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలయ్యే అవకాశంఉంది. మరి ఇటువంటి సమయంలో.. మెగా ఫ్యామిలీకి అభిమానినని చెప్పుకునే వర్మ.. ఊరుకుంటాడా చెప్పండి!! మరోసారి తన ట్వీట్ తో పవన్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చాడు. `పీకే ఫ్యాన్స్.. మీరంతా టేపులతో థియేటర్లకు రండి' అని ఉచిత సలహా ఇస్తున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ!! ఎందుకంటారా.. ఇంకెందుకు.. సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతోన్న థియేటర్ల దగ్గర టికెట్ల కోసం జనం కట్టిన క్యూ లైన్లు ఎంత పొడుగుంటాయో కొలవడానికి అంటున్నాడు. 'బాహుబలి విడులైన రోజు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర టికెట్లకోసం జనం 1.5 కిటోమీటర్ల దూరం క్యూ కట్టారు. ప్రభాస్ కే అంత దూరం క్యూ కడితే - ఇక పీకే కోసం ఏ రేంజ్ లో క్యూకడతారో చూడాలని ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా` అంటూ ట్వీట్ చేశాడు వర్మ.