బాక్సాఫీస్ దగ్గర సర్దార్ గబ్బర్ సింగ్ పరిస్థితి ఏమంత బాలేదు. తొలిరోజు రికార్డులు తప్ప చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదు. లేటుగా రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రచారం చేస్తున్నా.. పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. సర్దార్ ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిని బాగా ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకడని చెప్పాలి.
సర్దార్ రిజల్ట్ గురించి తాను ముందే చెప్పానని, చుట్టూ ఉన్న భజనపరులను పవన్ ఇప్పటికైనా దూరం పెట్టాలని.. ఇలా చాలా రకాలుగా వర్మ ట్వీట్స్ చేశాడు. అందులో పవన్ పై విమర్శలు చాలానే ఉన్నాయి. అయితే, వీటి గురించి నాకు తెలుసన్న పవన్.. తాను ఇలాంటివేవీ పట్టించుకోనని చెప్పేశాడు. కానీ, పవన్ ఫ్యాన్స్ మాత్రం వర్మను సోషల్ మీడియాలోనే కడిగేశారు. ఇంకా చెప్పాలంటే.. ఓ సైబర్ అటాక్ అనే రేంజ్ లో వర్మపై రెచ్చిపోయారు పవన్ ఫ్యాన్స్.
దీంతో వర్మ ఓ సీరియస్ డెసిషన్ తీసుకున్నాడు. ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అందరికీ చెప్పాడు కూడా. 'నేను ఓ మంచి ఉద్దేశ్యంతో చేస్తున్న ట్వీట్లను అపార్ధం చేసుకున్నారు. ఇక జీవితంలో పవన్ గురించి మరొక్క ట్వీట్ కూడా చేయకూడదని నిర్ణయించుకున్నా' అన్నాడు వర్మ. అయితే శపథం చేశాడు కదా అని రామ్ గోపాల్ వర్మని నమ్మడానికి లేదు. మళ్లీ తెల్లారేసరికి తూచ్ అనేసినా ఆశ్చర్యం ఉండదు.