అంతకు మించి అంటున్న వర్మ

Update: 2017-02-05 04:38 GMT
అన్ని సినిమాల్లో ఊర్మిళ మండోద్కర్ వేరు.. రామ్ గోపాల్ వర్మ తీసే మూవీస్ లో కనిపించే ఊర్మిళ వేరు. అంత అందంగాగా ఈ రంగీలా భామను ప్రెజెంట్ చేస్తాడు వర్మ. అసలు రంగీలా చిత్రానికి ముందు ఊర్మిళకు అంతగా క్రేజ్ లేదు. కేవలం ఆమె అందాల చుట్టూ ఫోకస్ చేస్తూనే.. ఆ మూవీని తీశాడు వర్మ.

ఆమిర్ ఖాన్.. జాకీష్రాఫ్ లాంటి హీరోలు నటించిన సినిమాలో.. ఊర్మిళ నటనకు అందాలకు అంత పేరు వచ్చిందంటేనే.. రంగీలాతో వర్మ చేసిన మాయ అర్ధం అవుతుంది. ఊర్మిళ విషయంలో తాజాగా ఒక బ్లాగ్ లో విభిన్నంగా స్పందించాడు వర్మ. 'ఊర్మిళ నేను కలిసిన అద్భుతమైన అందగత్తెల్లో ఒకరు. అంతకుముందే సినిమాలు కొన్ని సినిమాలు చేసినా.. ఆమెను సరిగా చూపించలేదు. అందుకే రంగీలా చిత్రంలో పాటలన్నీ ఆమె అందాల చుట్టూ తిరిగేలా తీశాను. ఆమె ఒక అందమైన పెయింటింగ్. ఆమెను నేను ఒక ఫ్రేమ్ లో సెట్ చేశానంతే. ఆ పెయింటింగ్ కు ఓ ప్లేస్ కావాలి.. అదే రంగీలా మూవీ' అన్నాడు వర్మ.

'ఊర్మిళను కేవలం సాధారణ మనిషి మాత్రమే అంటే.. పర్సనల్ గా నేను ఎందుకో ఒప్పుకోలేను. ఒక ఫిలిం మేకర్ గా ఇలా అనడం కరెక్ట్ కాకపోయినా.. రియల్ లైఫ్ లో కూడా ఆమెకు సాధారణ మనిషికి మించిన జీవితం ఉండాలని అనిపిస్తుంది' అని చెప్పాడు వర్మ. అప్పట్లో వర్మ-ఊర్మిళ మధ్య ఏదో ఉందంటూ చాలానే రూమర్స్ వచ్చాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే టాక్ కూడా నడిచింది. ఆ తర్వాత ఇద్దరూ  బ్రేకప్ అయిపోయినా.. ఒకరి గురించి మరొకరు ఎక్కడా నోరు మెదపకపోవడం విశేషం. గతేడాది మోసిన్ అక్తర్ మీర్ తో ఊర్మిళ వివాహం జరిగినపుడు.. 'నేను పనిచేసిన వారిలో అత్యంత అందమైన నటికి వివాహ శుభాకాంక్షలు. ఆమె జీవితం ఎల్లపుడూ రంగీలా మాదిరిగా ఉండాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశాడు వర్మ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News