ఈ కన్ఫ్యూజన్ ఏంటి వర్మా?

Update: 2018-02-19 10:48 GMT
విషయం ఏదైనా సంచలనానికి ఇంచు తక్కువైనా ఒప్పుకోని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  పోలీస్ విచారణను సైతం తన పబ్లిసిటికీ వాడుకోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇక ఇన్వెస్టిగేషన్ లో జిఎస్టి తాను తీయలేదు అని చెప్పినట్టుగా నిన్నటి నుంచి మీడియాలో బాగా హోరెత్తుతున్న సంగతి తెలిసిందే. తనే స్వయంగా మియా మల్కోవా ను షూట్ చేస్తున్నట్టు మేకింగ్ స్టిల్స్ గతంలో వదిలిన వర్మ ఇప్పుడు ఇలా మాట మార్చాడేంటా అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తను అలా అనలేదని నిర్మాణం, సాంకేతిక అంశాలకు మాత్రమే తనకు సంబంధం లేదని అన్నానని, తానే తీసినట్టు చెప్పుకుని నేను దర్శకుడిని కాను అని ఇప్పుడు ఎందుకు మాట మారుస్తానని క్లారిటీ ఇచ్చాడు.

అంతా బాగానే ఉంది కాని టెక్నీకల్ ఇష్యూస్ తో నాకు సంబంధం లేదన్న వర్మ మరి జనవరి 26 ఉదయం జిఎస్టి అప్ లోడ్ కానప్పడు ట్రాఫిక్ వల్ల చేయలేకపోయామని, మరుసటి రోజు ఉదయం అందుబాటులో ఉంటుందని స్వయంగా ప్రకటించాడు. నిర్మాణ సంస్థ తరఫున తానే మొత్తం కమ్యూనికేట్ చేసాడు. మరి ఈ రోజు అవి నాకు సంబంధం లేదు అంటున్న వర్మ అప్పుడు ఆ వ్యవహారాలన్నీ ఎందుకు చేతిలోకి తీసుకున్నట్టు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంది. తన లాప్ టాప్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం గురించి కూడా వర్మ ఇంకా ఏమి చెప్పడం లేదు.

ట్విట్టర్ లో మాత్రం వర్మ తన మెసేజుల ప్రహసనం కొనసాగిస్తూనే ఉన్నాడు. టీవీ9 రజనీకాంత్, తనలో ఎవరు నిజాయితో చెప్పాలని పోల్ పెట్టిన వర్మ మద్దతు బాగానే దక్కించుకుంటున్నాడు. నాగార్జునతో సినిమా మొదలుపెట్టాక వర్మ లో చాలా మార్పు వస్తుందనుకుంటే బావ బావే - పేకాట పేకాటే అన్న టైపులో తన సహజ ధోరణిలోనే వివాదాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. మరి జిఎస్టి తను తీశానని ఒప్పుకున్నాడు కాబట్టి తదుపరి పోలీసు చర్యలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. ట్రూత్ తెలుసుకోమంటున్న వర్మ అదేదో ముందు తాను చెబితే బెటర్.
Tags:    

Similar News