వివాదాలతో సహవాసం చేసే రాంగోపాల్ వర్మ మరోసారి నోరు జారి చిక్కుల్లో పడ్డారు. ఏదో ఒక వివాదంతో ట్రెండింగ్ లో లేనిదే నిద్రపట్టని వర్మ తాజాగా రైతులపై దారుణ వ్యాఖ్యలు చేశారు. వర్మ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన సినిమాల ప్రచారం కోసం ఏదో వివాదాన్ని రాజేసి సినిమాకు హైప్ తీసుకొచ్చే వర్మ ఈసారి కూడా అదే స్ట్రాటజీని అమలు చేసి వార్తల్లో నిలిచాడు.
వర్మ నిర్మాణంలో తాజాగా ‘భైరవ గీత’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ న్యూస్ చానెల్ డిబేట్ లో పాల్గొన్న వర్మకు ఓ మహిళ ఫోన్ చేసి హితబోద చేసింది. ‘భైరవ గీత’ లాంటి హింసాత్మక సినిమాలు కాకుండా దేశానికి ఉపయోగపడే సినిమాలు చేయవచ్చు కదా అని ప్రశ్నించింది. దీనికి వర్మ బదులిస్తూ.. ‘తనకు ఏమాత్రం బాధ్యత లేదని.. సమాజం పట్ల ధ్యాస లేదని.. తాను ఇలాగే ఉంటానని..’ చెప్పుకొచ్చాడు. మీలాంటి మంచి దర్శకుడు జనాల కోసం ఆలోచించాలని.. రైతుల సమస్యలపై సినిమా చేస్తే జనాల్లోకి వెళ్తుందని కదా అని ప్రశ్నిస్తే వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..
‘రైతులంటే నాకు చిరాకు. వాల్లు ఎప్పుడు మట్టిలోనే ఉంటారు. నాకు మట్టి అంటే అసహ్యం. అందుకే నేను రైతుల మీద సినిమా తీయను. ఒకవేళ రైతులు తుపాకులు - కత్తులు పట్టుకుంటే అప్పుడు వాళ్లపై సినిమా తీయడం గురించి ఆలోచిస్తా’ అని వ్యాఖ్యానించాడు. రైతులపై నోరుపారేసుకున్న వర్మ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దేశానికి వెన్నుముక.. మన అందరికీ అన్నం పెట్టే రైతన్నపై వర్మ ఇలా మాట్లాడుతాడా అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.