ఏ ఇష్యూనయినా... సొంతానికి వాడేసుకోవడంలో వర్మని మించినోడు ఉండడు. ప్రపంచం మొత్తానికి కనిపించేది ఒకటుంటే.. రామ్ గోపాల్ వర్మ చూసే దృష్టి మరోలా ఉంటుంది. సెంటిమెంట్లు లేవని, దేవుళ్లు బూటకమనీ చెప్పే ఈ క్రియేటర్.. ఇప్పుడు వినాయకచవితినీ వదిలిపెట్టలేదు.
ఓ వారం క్రితం అనుకుంటా.. వినాయకుడికి వర్మ దండం పెట్టే ఫోటో ఒకటి ట్వీట్ చేశాడు ఆయన శిష్యుడు పూరి జగన్. ఇప్పుడదే ఫోటోను మళ్లీ పోస్ట్ చేసి, అందరికీ ఆరోగ్యం అందేలా గణేషుడు ఆశీర్వదిస్తాడని, దీనితో డాక్టర్ లకు పనిలేక హాస్పిటల్స్ మూతపడతాయని అనుకుంటున్నాడట.
ఇక్కడితో ఆగిపోతే వర్మ ఎలా అవుతాడు చెప్పండి. అందరికీ వినాయకుడు సంపద ఇచ్చేస్తాడని.. దీంతో ఎవరూ పని పాటా మానేసి ఇంట్లోనే కూర్చోవచ్చని ట్వీటాడు. అంతే కాదు.. తాను తీసిన ఆగ్ లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమాతో సహా.. అన్ని మూవీలను కూడా వినాయకుడు సూపర్ హిట్ చేయాలని కోరుకున్నాడట.
తనలాంటి ముక్కుసూటి కోపిష్టివాడిని.. మృదువుగా సౌమ్యంగా మార్చాల్సిన బాధ్యతే గణేషుడిదే అన్నాడు వర్మ. ఏమైనా వర్మ వ్యూనే వేరుగా ఉంటుంది. ఎక్కడ నరకాలో నరుకుతూ.. ఎక్కడ తగలాలో చక్కగా వదిలేస్తాడు కౌంటర్స్.