అందరి కంటే భిన్నమైన ఆలోచనలు - భిన్నమైన వ్యాఖ్యలకు పేరొందిన దర్శకుడు రాంగోపాల్ వర్మ సందర్భం వచ్చినప్పుడంతా ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా నిన్న దీపావళి సందర్భంగానూ ఆయన సరదా వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ధనికుల్లో ఒకరైన ముకేశ్ అంబానీపై ఆయన ఫన్నీ కామెంట్లు చేశారు. అవి సందర్భోచితంగా ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత - ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీపై నిన్న రాము చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంది. ‘అమ్మవారు లక్ష్మీదేవిని పూజించే వాళ్లు ఎంతో మంది ఉండగా - ముఖేష్ అంబానీనే ఆమె ఎక్కువగా కరుణిస్తుంది ఎందుకో? ప్రత్యేకంగా ఆయనేమైనా ప్రార్థిస్తారా? లేక బయటకు చెప్పటానికి వీలుకాని ‘డీల్’ ఏదైనా వారి మధ్య ఉందా?’ అంటూ సరదాగానో లేక వ్యంగ్యంగానో వర్మ తన ట్వీట్ లో ప్రశ్నించారు.
అయితే... రాము వ్యాఖ్యలపై విమర్శలూ మొదలయ్యాయి. దేవుళ్లను టార్గెట్ చేసి రాము అలా అనడం కరెక్టు కాదంటుండగా కొందరు మాత్రం రాము స్టైలే అంత.. అవన్నీ సరదా వ్యాఖ్యలేనని అంటున్నారు. ఇంకొందరు మాత్రం బిల్ గేట్సు - వారెన్ బఫెట్ వంటి సంపన్నులు అసలు లక్ష్మీ పూజే చేయరు కదా.. మరి వారెలా అంత ధనవంతులయ్యారని ప్రశ్నిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/