వర్మ మార్చేశాడంటున్న లేడీ డైరక్టర్

Update: 2016-07-17 04:06 GMT
టాలీవుడ్ లో కొత్త ట్యాలెంట్ కి కొదువ లేదు. చాలా మంది వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు. కానీ వచ్చీ రావడంతోనే ఆసక్తి కలిగించేవారు మాత్రం తక్కువగా ఉంటారు. అలా ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త దర్శకురాలు సంజనా రెడ్డి పెరు వినిపిస్తోంది. కేవలం 40 రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తానని చెప్పి సినిమా స్టార్ట్ చేసి.. ఇప్పటికే సగం పూర్తి చేసేసిందీమె.

ఓ న్యూస్ ఛానల్ లో జర్నలిస్ట్ గా కొన్ని నెలలు పని చేసిన తర్వాత.. ఓ సందర్భంలో రామ్ గోపాల్ వర్మను కలిసింది సంజన. ఆ మీటింగ్ తన లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అంటోందీమె. ' నేను జాబ్ ఛేంజ్ కోసం చూస్తున్నపుడు రామ్ గోపాల్ వర్మను కలిశాను. తర్వాత ఆయన అసిస్టెంట్ గా చేరిపోయాను. వర్మ షూటింగ్ ప్లాన్ చేసే విధానం.. అసిస్టెంట్లతో డిస్కషన్స్ - అందరి అభిప్రాయాలను గౌరవించడం.. సూపర్బ్ గా ఉంటుంది. కొత్త ట్యాలెంట్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ట్యాలెంట్ విషయంలో కొత్త పాత అనే బేధాలు ఆయనకు ఉండవు' అంటోందీ కొత్త డైరెక్టర్.

ఆ తర్వాత ఓ యాడ్ షూటింగ్ కి అసిస్టెంట్ డెరెక్టర్ కావడం,.. పరిస్థితుల కారణంగా తనే దర్శకత్వం వహించాల్సి రావడం.. హైద్రాబాద్ వచ్చి నిర్మాత అనిల్ సుంకరను కలవడం.. 40 రోజుల్లోనే సినిమా పూర్తి చేస్తానని తన ప్లానింగ్ వివరించడం అంతా ఓ కల సాకారం అయినట్లుగా ఉందని అంటుందీమె. రాజ్ తరుణ్ - అమైరా దస్తూర్ జంటగా నటిస్తున్న చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంజనా రెడ్డి.. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసేయడం విశేషం.
Tags:    

Similar News