వర్మ కథకు ఎండ్ కార్డ్ పడిందా?

Update: 2018-06-06 18:20 GMT
టాలీవుడ్ లో గత ఏడాది నుంచి ఎన్టీఆర్ బయోపిక్ గురించి అనేక రకాల వార్తలు వస్తుండడం కామన్ అయిపొయింది. ఎన్ని వచ్చినా కూడా జనాలు మాట్లాడుకునేది ఒక్కటే.. ఎన్టీఆర్ రెండవ కోణం గురించి సినిమాలో ఎలాంటి ప్రస్తావన ఉంటుందని చర్చించుకోవడం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇకపోతే అప్పట్లో బాలయ్య బాబు ఎన్టీఆర్ స్టార్ట్ అవుతోంది అనగానే వర్మ కూడా ఎన్టీఆర్ పేరుకు లక్ష్మీస్ ని జోడించి మొదలైందని చెప్పేశాడు.

ప్రతి సినిమాకు ముందు వర్మ కాంట్రవర్షియల్ ను క్రియేట్ చేయడం పెద్ద ఆశ్చర్యం ఏమి కాదు. ఆ సినిమా మొదలవ్వకముందే ఓ పోస్టర్ ని రిలీజ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు, ఈ కోణాన్ని అద్భుతంగా చూపిస్తాను అని చేసిన రచ్చ అప్పట్లో సంచలనం సృష్టించింది. అలాగే వైసిపి నేత నిర్మాతగా రావడం మరొక హైలెట్ పాయింట్ కానీ వర్మ నాగార్జున తో ఆఫీసర్ సినిమా కమిట్ అయిన తరువాత లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి మాట్లాడలేదు.

నాగ్ కూడా కాంట్రవర్షియల్ కాకుండా మొత్తం తన సినిమా గురించే ఆలోచించాలని చెప్పడంతో ఆర్జీవీ ఏ ప్రజెక్టు గురుంచి పట్టించుకోకుండా ఆఫీసర్ సినిమా చేశాడు. కానీ ఆఫీసర్ ఊహించని దెబ్బ కొట్టడంతో హీరోలు వర్మ అంటేనే భయపడుతున్నారు. ఏ నిర్మాత బయ్యర్ కూడా అతనితో చేతులు కలిపేందుకు సిద్ధంగా లేరు. వైసిపి నేత కూడా డ్రాప్ అనేశాడు. పైగా నటీనటులను ఎంపిక చేయడం అనేది శక్తికి మించిన పని. మొత్తానికి వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కథ మొదలవ్వకముందే ఎండ్ కార్డ్ పడినట్లు టాక్ వస్తోంది.  


Tags:    

Similar News