తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తానని చెప్పడమే చాలామందికి షాకింగ్ మారింది. అది కూడా అందరూ కేసీఆర్ గా చూస్తున్న ఆయన్ను.. రివర్స్ యాంగిల్ లో చూపిస్తాననడం.. సినిమాకి ఆర్.సి.కె. అని టైటిల్ పెట్టానని చెప్పడంతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు వర్మ.
ముంబై దాడులు జరిగినపుడు.. నయీమ్ మర్డర్ జరిగినపుడు లాంటి ఉపద్రవాలు సంభవించినపుడే.. సహజంగా వర్మకు సినిమా ఆలోచనలు పుడతాయి. మరి కేసీఆర్ పై సినిమా తీస్తానని చెప్పడానికి కారణం ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు. బహుశా.. కేసీఆర్ పై బయోపిక్ తీస్తున్నట్లు వేరే నిర్మాతలు అనౌన్స్ చేయడంతో.. ఈ దర్శకుడు కూడా దృష్టి పెట్టాడనే ఫీలింగ్ వచ్చింది. అది కూడా ఆ బయోపిక్ ప్రకటన వచ్చిన గంటల వ్యవధిలోనే వర్మ అనౌన్స్ మెంట్ రావడం కూడా ఇందుకు రీజన్.
కానీ ఇప్పుడు ఆర్ సి కె మూవీ ఆలోచన వెనక ఉన్న కారణం చెప్పాడు వర్మ. 'కేటీఆర్ తో సుదీర్ఘమైన చర్చల తర్వాతే.. కేసీఆర్ పై సినిమా ఆలోచన పుట్టింది' అంటూ వర్మ ట్వీట్ పెట్టాడు. ఇప్పటికే ఆర్ సి కె అంటూ కేసీఆర్ పేరును రివర్స్ లో పలుకుతూ.. వివాదం రాజేస్తున్న వర్మ.. ఇప్పుడు కేసీఆర్ తనయుడు కేటీఆర్ ను కూడా ఇందులోకి లాగేందుకు ట్రై చేసేస్తున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/