ఈ సౌండ్ సరిపోతుందా ఆఫీసర్ ?

Update: 2018-05-31 11:35 GMT
రేపు నాగార్జున ఆఫీసర్ విడుదల కానుంది. బహుశా నాగ్ కెరీర్ లో ఇంత లో ప్రొఫైల్ లో విడుదల అవుతున్న మూవీ ఇదే కావొచ్చు. దానికి కారణం లేకపోలేదు. వర్మ తన స్థాయిలో సినిమా తీసి చాలా కాలమే అవుతోంది. మధ్యలో కిల్లింగ్ వీరప్పన్ లాంటి సినిమాలు పర్వాలేదు అనిపించినా అతనిలోని నిజమైన టెక్నీషియన్ ని బయటపెట్టినవి అయితే కాదు. అందుకే ఆఫీసర్ మీద బజ్ తక్కువగా ఉంది. ప్రమోషన్ విషయం నాగ్ ఎంత సహకరిస్తున్నా ఆశించిన ఊపు మాత్రం రావడం లేదు. టాక్ వస్తే తప్ప స్పీడ్ పెరగదు. దానికి తగ్గట్టే విడుదల కూడా కేవలం 400 థియేటర్లకే పరిమితమైనట్టు సమాచారం. అంటే ఎలా చూసుకున్నా ఇది చాలా తక్కువ నెంబర్. రేపు మరో రెండు సినిమాలు రాజుగాడు ప్లస్ అభిమన్యుడుతో పాటు హిందీ మూవీ వీర్ దే వెడ్డింగ్ కూడా రానుంది. ఈ నేపథ్యంలో అనుకున్న నెంబర్ లో స్క్రీన్లు దక్కలేదు అని సమాచారం. పైగా డిస్ట్రిబ్యూషన్ వ్యవహారంలో  అన్నపూర్ణ సంస్థ తల దూర్చకూడదు అని ముందే నిర్ణయించుకున్న నేపథ్యంలో మొత్తం వర్మనే చూసుకున్నట్టు తెలిసింది.

రేపు మధ్యాన్నం లోపే పూర్తి టాక్ వచ్చేస్తుంది కాబట్టి ఆడుతుందా ఓడుతుందా అనేది తేలిపోతుంది. వర్మ పదే పదే ఇది చాలా బాగా తీశాను నచ్చకపోతే తనను  కొట్టండి లాంటి స్టేట్మెంట్లు నాగార్జునతోనే చెప్పేస్తున్నా అభిమానులు తప్ప సామాన్య ప్రేక్షకులు నమ్మడం లేదు. వర్మ షాక్ ఇచ్చినా ఇస్తాడు. ఇలాంటి బ్యాడ్ టైంలోనే కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ అవకాశం ఇస్తే కిల్లింగ్ వీరప్పన్ రూపంలో అక్కడ చెప్పుకోదగ్గ హిట్టే ఇచ్చాడు. తెలుగు లో హీరోకు  పరిచయం తక్కువ కనక జస్ట్ పర్వాలేదు అనిపించుకుంది. రాజుగాడు పోటీ అనలేం కానీ ఆల్రెడీ తమిళ్ లో హిట్ టాక్ తెచ్చేసుకున్న అభిమన్యుడు తెలుగులో కూడా అదే రిజల్ట్ ఆశిస్తోంది. మరి ఆఫీసర్ తమ మిషన్ లో గెలవడం అంత ఈజీ కాదు. వర్మ మాత్రం నాన్ స్టాప్ గా సౌండ్ టీజర్లు వదులుతూనే ఉన్నాడు. ఇవాళ సాయంత్రం నాగార్జున తాను ఒకరికొకరు స్పెషల్ గా చేసుకున్న ఇంటర్వ్యూ విడుదల చేయబోతున్నాడు. ఇవన్నీ సరే కంటెంట్ ఉంటే సక్సెస్ ఆపడం ఎవరి తరం కాదు కానీ చిక్కంతా అంచనాలు నిలబెట్టుకోవడంలోనే ఉంది. చూద్దాం రేపటి దాకా
Tags:    

Similar News