నందమూరి బాలకృష్ణ తలపెట్టిన ఎన్టీఆర్ బయోపిక్‌కు పోటీగా రామ్ గోపాల్ వర్మ గతంలో ప్రకటించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆగిపోయిందనే అంతా అనుకున్నారు. కొన్ని నెలలుగా దీని గురించి అసలు ఊసే లేదు. ఓవైపు బాలయ్య ‘యన్.టి.ఆర్’ చకచకా విడుదలకు రెడీ అవుతుండగా.. వర్మ సినిమా గురించి అందరూ మరిచిపోయారు.. ఇలాంటి తరుణంలో రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటనతో మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో తాను ఎన్టీఆర్ బయోపిక్ త్వరలోనే మొదలుపెట్టబోతున్నట్లు వర్మ ప్రకటించాడు.
ఈ చిత్రాన్ని ఇంతకుముందు నిర్మించడానికి ముందుకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ నేత వెనక్కి తగ్గడంతోనే వర్మ కూడా సైలెంటైపోయాడు. ఐతే ఇప్పుడు వర్మకు నిర్మాత దొరికాడు. ముంబయికి చెందిన పారిశ్రామికవేత్త బాలగిరికి చెందిన జీవీ ఫిలిమ్స్ బేనర్ మీద రాకేష్ రెడ్డి నిర్మాణంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రూపొందిస్తామని.. ఈ విజయ దశమికి సినిమా మొదలుపెట్టి జనవరి చివరికల్లా సినిమా షూటింగ్ పూర్తి చేస్తామని ఆర్జీవీ తెలిపాడు. అక్టోబర్ 19న సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా అతనన్నాడు. ఎన్టీఆర్, లక్ష్మిపార్వతి, చంద్రబాబు నాయుడులతో కూడిన పాత పోస్టర్‌ను వర్మ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘ఎన్టీఆర్ ట్రూ స్టోరీ’ అనే హ్యాష్‌ట్యాగ్ జోడించి ఆ విషయాన్ని వెల్లడించడం విశేషం.
ఎన్టీఆర్ బాల్యం.. ఆయన సినిమాల్లో ఎదగడం.. స్టార్ పొలిటీషియన్ కావడం.. ముఖ్యమంత్రిగా మారడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అని... ఇందులో ఏమాత్రం కాన్ ఫ్లిక్ట్ అనేదే లేదని.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏం చూపించినా అది పేలవంగా ఉంటుందని.. కానీ లక్ష్మీపార్వతి రాకతో ఎన్టీఆర్ జీవితంలో అనేక పరిణామాలు జరిగాయని.. ఆ స్ట్రగులే తాను చూపిస్తానని వర్మ ఇంతకుముందే ప్రకటించాడు. మరి వర్మ నిజంగా ఈ సినిమా తీసి జనాల ముందుకు తెస్తాడా అన్నది చూడాలి.