ఇప్పుడు తెలుగు సినీ ప్రేక్షకుల చర్చలన్నీ ‘ఎన్టీఆర్’ చుట్టూనే తిరుగుతున్నాయి. ఓవైపు నందమూరి బాలకృష్ణ-క్రిష్ జాగర్లమూడి కలిసి చేసిన ‘యన్.టి.ఆర్’ చిత్రీకరణ పూర్తి చేసుకుని సంక్రాంతి విడుదలకు సిద్ధం అవుతుంటే.. మరోవైపు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సైతం చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. నిన్న రిలీజ్ చేసిన ‘యన్.టి.ఆర్’ ట్రైలర్లో భారీతనం.. విజువల్ బ్రిలియన్స్.. కళాత్మక దృష్టి కనిపించాయి కానీ.. ఈ చిత్రంలో ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలూ ఉంటాయా అన్నది మాత్రం సందేహంగానే కనిపించింది. నటుడిగా ఎన్టీఆర్ ఎదుగుదల.. రాజకీయ రంగప్రవేశం.. అందులో విజయాలు.. ఆరంభ దశలో ఒడుదొడుకుల వరకే చూపించినట్లున్నారు. అంతకుమించి రాజకీయ రంగంలో రెండో దశను.. చంద్రబాబు వెన్ను పోటు వ్యవహారాన్ని అస్సలు టచ్ చేసినట్లు లేదు. జీవిత చరమాంకంలో రామారావు అనుభవించిన మానసిక క్షోభకు ఇందులో చోటే లేనట్లుంది. దీంతో ఈ బయోపిక్ ఎలా పరిపూర్ణం అవుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆసక్తి రేకెత్తిస్తోంది. వర్మ ఇప్పటికి ఏం తీస్తున్నాడో కానీ.. ‘యన్.టి.ఆర్’ రెండు భాగాలూ విడుదలయ్యే వరకు ఎదురు చూసి.. అందులో మిస్సయిన అంశాలన్నింటినీ తన చిత్రంలో ఉండేట్లు చూడాలని కోరుకుంటున్నారు జనాలు. రెండు బయోపిక్స్ లో ఏది ఒరిజినల్.. ఏది ఎక్కువ ఆసక్తి రేకెత్తిస్తోందని వర్మ పోల్స్ పెడితే మూడింట రెండొంతుల మంది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కే ఓటేయడం విశేషం. ఓట్లు వేసింది వంద మందో వెయ్యి మందో కూడా కాదు. 40-50 వేల దాకా ఓట్లు పడ్డాయి. ఈ స్థాయి ఓటింగ్‌లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు అంత మెజారిటీ రావడం ప్రేక్షకుల ఆసక్తిని తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో వర్మ సిన్సియర్ గా ఉండి.. ‘వెన్ను పోటు’ పాటలో చూపించిన తెగువను కొనసాగిస్తూ ఎన్టీఆర్ జీవితంలో రహస్యంగా ఉండిపోయిన కోణాలన్నింటినీ ఈ చిత్రంలో చూపిస్తే అది గొప్ప విజయం సాధించే అవకాశముంటుంది.