దేవుళ్ళపై - పండగలపై వర్మ ఏవో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడు. తనను నాస్తికుడు అని చెప్పుకుంటాడు. జనాలు కూడా అయన అంతే అని సరిపెట్టుకున్నారు. అంతలో జనాలందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాడు. నుదుటన కుంకుమ బొట్టు.. మెడలో టీటీడీ వారు కప్పిన ఎర్ర శాలువా.. చేతిలో లడ్డూ తో ఒక ఫోటో తీయించుకుని దాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.
దర్శనం తర్వాత ప్రెస్ మీట్ లో తిరుమల వెంకటేశ్వర స్వామివారితో తనకున్న అనుబంధంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పాతికేళ్ళ క్రితం 'గోవిందా గోవిందా' సినిమాకు ముందు తిరుపతి కి వచ్చి గుడిలో నగలు ఎలా దొంగతనం చేసే ప్లాన్ వేయాలా అనే ఆలోచనతో లోపల అడుగుపెట్టానని అన్నాడు. దేవుడి కి కోపం వచ్చి ఆ సినిమాను ప్లాప్ చేయించాడని.. దాంతో బాలీవుడ్ కు పారిపోవలసి వచ్చిందన్నాడు.
అంతే కాదు లాస్ట్ ఇయర్ వేంకటేశ్వర స్వామి విషయంలో తను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి కాబట్టి.. శుక్రవారం దర్శనానికి వెళ్ళినప్పుడు లోపల ఉండే పూజారులు.. భక్తులు తనపై కోపంతో తలుపులు మూసేసి కొడతారని అనుకున్నానని అన్నాడు. కానీ అలా ఏం జరగలేదట. అంతే కాదు దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి తనమీద కోపంతో కిరణాల్ని తనమీదికి పంపి ఏదో చేస్తాడని అనుకున్నాడట.. కానీ జనాలతో పాటు వెంకటేశ్వర స్వామి కూడా తనను క్షమించారేమో అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.