ఆ మధ్య హిందీలో కూడా అదిరిపోయే సర్కార్ వంటి సినిమాలను తీశాడు రామ్ గోపాల్ వర్మ. ఆ తరువాత మనోడు తీసినవన్నీ చెత్త సినిమాలే. తెలుగులో కూడా రక్తచరిత్ర సినిమా తరువాత అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా చూడసొంపైన సినిమాయే చేయలేదు. అన్నీ ఐస్ క్రీములూ.. పట్టపగళ్ళూ అంటూ దంచి కొట్టాడు. రిలీజైనవి బాధించాయి.. రిలీజవ్వకుండా కొన్ని వెక్కిరించాయి.
ఇటువంటి సినిమాలు ఇక జీవితంలో చేయనని అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. ''రాజమౌళి వంటి దర్శకులు ఒక ట్రాక్ ను ఫుల్లుగా చెక్ చేసుకుని దానిపై పరిగెడతారు. నేను మాత్రం మనం ఎక్కడ పరిగిడితే అక్కడ ట్రాక్ ఆటోమ్యాటిక్ గా వచ్చేస్తుందని అనుకుంటాను. నేనొక వైల్డ్ హార్స్ ని. రాజమౌళి ఒక టేమ్డ్ గుర్రం'' అని కామెంట్ చేస్తూ.. ఒక మాటిచ్చాడు.. ''ఇక మీదట నేను చేయబోయే సినిమాలన్నీ కూడా ఎంతో ఖ్యాతిని తీసుకురావాలని.. చాలా ప్రౌడ్ ఫీలింగ్ కలిగించేవిగా ఉండేలా చూసుకుంటాను. ఇక మీదట చెత్త సినిమాలు తీయను. నేను మాట మీద ఉండను అంటారు కాని.. రాజమౌళి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఇక అలాంటి సినిమాలు తీయను. నా లైఫ్ లో ఇప్పుడు చాలా హానెస్టీగా ఉంటున్నాను. సో మాట మీద ఉంటాను'' అని ప్రామిస్ చేశాడు గురుడు.
ఆ తరువాత నాగార్జున మాట్లాడుతున్నప్పుడు కూడా మరోసారి మాటిచ్చాడు. ''నాకు రాజమౌళి తో పెద్దగా అనుబంధం లేదు కాబట్టి.. మనోడి మీద వేసిన ఒట్టును తీసి పక్కనెట్టేసే ఛాన్సుంది. కాని ఇప్పుడు నాగ్ మీద కూడా ఒట్టేస్తున్నాను. ఇక మీదట అన్నీ మంచి సినిమాలే తీస్తాను. నాకు నాగ్ నాకంటే ఎక్కువగా ఇష్టం'' అంటూ మరోసారి ఒట్టేశాడు. ఇక నాగార్జున కూడా ఇకమీదట రామ్ గోపాల్ వర్మ అన్నీ కూడా ఆణిముత్యాల వంటి అద్భుతమైన సినిమాలనే సృష్టించాలని కోరుకున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/