ఈ స్నేకులు ఆ దర్శకుడి కంట పడ్లే

Update: 2016-05-12 17:30 GMT
స్నేక్‌ గ్యాంగ్‌. హైదరాబాద్‌ లో ఏకంగా 37 మంది యువతలను (కపుల్స్ ను) పాములతో బెదిరించి.. అమ్మాయిలను వివస్ర్తలను చేసి.. వారిని న్యూడ్‌ గా వీడియో లు తీసి.. అత్యాచారాలు చేసి.. బ్లాక్ మెయిల్‌ చేశారు. ఈ గ్యాంగుకు నిన్నే రంగారెడ్డి జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. అయితే ఈ శిక్ష సరిపోతుందా సరిపోదా అనే వాదన ఇంకా నడుస్తున్నప్పటికీ.. అసలు ఈ కేసుపై మన వివాదాల వర్మ ఎందుకు ఫోకస్‌ పెట్టేలదంటారు?

మామూలుగా ఏదైనా ఇంట్రెస్టింగ్‌ ఇన్సిడెంట్‌ అంటే.. అది కేవలం ఫ్యాక్షన్‌ మర్డర్లే కాదు.. ఇలాంటి వికృత చేష్టల మీద కూడా సినిమాలు చేయొచ్చు. అసలు ఆ స్నేక్‌ గ్యాంగ్‌ సభ్యుల కుటంబ పరిస్థితుల నుండి.. 37 మందిని వారు హింసించాక.. ఒకమ్మాయి కంప్లయింట్‌ ఇవ్వడంతో.. పోలీసులు వారిని వలపన్ని పట్టుకున్న తీరు వరకు.. అంతా షాకింగే షాకింగ్‌. పైగా ఇప్పటికీ వారి కుటుంబ సభ్యులు.. మా వాళ్లు అమాయకులు.. పోలీసులే కేసుల్లో ఇరికించారు అంటూ కోర్టు బయట శాపనాలు పెడుతున్నారు. ఒక ప్రక్కన వీరి పాములతో చేసిన విన్యాసాల వీడియోలే కాకుండా.. అమ్మాయిలను వీరు న్యూడ్‌ గా చిత్రీకరించిన వీడియోలు.. అందులో వీరి హేయమైన చేష్టలు.. అన్నీ వీడియోలతో సహా పట్టేశారు ఖాకీలు. అయినాసరే వాళ్ళ ఫ్యామిలీలు మాత్రం.. వీరిని అమాయకులు అంటున్నారు. ఈ స్నేకులపై ఒక సినిమా తియ్యవయ్యా వర్మ.

ప్రస్తుతం వర్మ విజయవాడ రాజకీయాలతో ''వంగవీటి''.. కన్నడ మాఫియాతో ''డాన్‌''.. ఇంకేదో సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Tags:    

Similar News