హీరోయిజానికి,విలనిజానికి మధ్యగీతపై వర్మ స్వారీ

Update: 2016-12-24 05:11 GMT
రామ్ గోపాల్ వర్మ డిజాస్టర్లు తీసివుండచ్చు. రకరకాల చెత్త కామెంట్లు చేస్తూ వుండచ్చు. అయితే అతనినుండి ఒక సినిమా వస్తుందంటే ఇంకా కొన్ని కళ్ళు ఆశగా అటువైపు చూస్తుంటాయి. అలాంటిది వర్మ కాంట్రవర్షియల్ 'వంగవీటి' సబ్జెక్టుతో రావడంతో కొన్ని లక్షల కళ్ళు ఎదురుచూడసాగాయి.

నిన్న విడుదలైన వంగవీటిపై మిశ్రమ స్పందన ఎదురైంది. ఆనాటి రాజకీయాలలో అతికీలకమైన నాలుగు హత్యలను అద్భుతంగా చూపించిన వర్మ వంగవీటి ఎదుగుదలను, మాస్ లీడర్ గా మారిన విధానాన్ని తెరకెక్కించలేదని, కాంట్రవర్సీలకు దూరంగా వుండిపోయాడని విమర్శలు ఎదుర్కున్నాడు.

అయితే నిశితంగా గమనిస్తే వంగవీటిలో ఎక్కడా కుల ప్రస్తావన రాకుండా, ఎదురురెదురుగా ఢీకొంటున్న ఏ ఇద్దరిలోనూ ఈ ఒక్కడే హీరో అని చూపించకుండా అందరిలోనూ మంచి చెడులను ప్రస్తావిస్తూ హీరోయిజానికి విలనిజానికి మధ్యనున్న గీతపై వర్మ బ్యాలన్స్ గా సినిమా తియ్యడం తప్పక ఆకట్టుకుంటుంది. అతిగా ఆశించి వెళ్తే నిరాశపడచ్చేమోగానీ అంచనాలు లేకుండా వెళ్తే వర్మ నిరాశపరచడు.    

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News