విలక్షణ నటుడు నానా పటేకర్ పై తనూ శ్రీ దత్తా చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. దాదాపుగా అన్ని రంగాల నుంచి కొందరు మహిళలు తాము కూడా `మీటూ`బాధితులమేనని బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి అక్బర్ కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మీటూ ఉద్యమంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తనదైన శైలిలో మీటూ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్లను మగాళ్లందరూ 'సెక్స్ సింబల్'గా చూస్తారనేది తన అభిప్రాయమని, తాను కూడా అంతేనని వర్మ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ, తన జీవితంలో ఏ ఆర్టిస్టునూ దేనికీ ఫోర్స్ చేయలేదని - ఒక అమ్మాయిని బలవంతం చేయడం - ఆమెతో తప్పుగా ప్రవర్తించడం వంటివి జరగలేదని అన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే స్త్రీ - పురుష భేదం ఉండదని, ఎవరైనా సాధించవచ్చని అన్నారు. ఓ ప్రముఖ దినపత్రికకు వర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మగవారితో పోలిస్తే ఆడవారు ఎందులోనూ తక్కువ కాదని, స్త్రీ తలచుకుంటే ఏమైనా సాధిస్తుందని అన్నారు. స్త్రీకి ఉన్న మహాశక్తి ఆకర్షణేనని, మగవాళ్లకు అది లేదని అన్నారు. స్త్రీలు అందాన్ని తాను పొగుడుతానని, వారిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని చెప్పారు. మహిళలను తాను అవమానించలేదని - వారిని ఎప్పుడూ తక్కువ దృష్టితో చూడనని తెలిపారు. 'మీటూ' ఉద్యమాన్ని లైంగిక వేధింపులు - అత్యాచారాల కోణంలో తాను భావించడం లేదని అన్నారు. ఆడవాళ్లను మగవారు తమ పొగరుతో తక్కువ చేసి చూస్తున్నందునే 'మీటూ' ఉద్యమం వచ్చిందన్నారు. ఈ ఉద్యమం మంచిదేనని - దీని వల్ల పురుషులు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తారని వర్మ అన్నారు. ఏది ఏమైనా ....మహిళలను అవమానకరంగా చూస్తారని పేరున్న వర్మ....ఈతరహాలో వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.