సంచలన దర్శకుడుగా గుర్తింపు పొందిన రాంగోపాల్ వర్మ సాధారణంగా ఎవరినీ పొగడడు. ఎవరినైనా పొగుడుతున్నట్లు అనిపించినా.. అందులో అంతరార్ధం తెగడ్డమే అయి ఉంటుంది. వేరేవాళ్లను చిన్నబుచ్చడానికి.. కించపరచడానికి తప్ప సహజంగా.. ఈయన సోలోగా మనస్ఫూర్తిగా పొగడ్డాలు లాంటి ఉండవు. వర్మకు గల ఇలాంటి మెంటాలిటీకి ఒకే ఒక్కరు మినహాయింపు.
మనస్సాక్షితో మనస్ఫూర్తిగా వర్మ పొగడ్తలు కురిపించే ఏకైక వ్యక్తి.. ఆయన ఆరాధ్య దేవత.. అభిమాన హీరోయిన్ శ్రీదేవి మాత్రమే. వర్మ చూపించే శృతి మించిన అభిమానం.. అప్పుడప్పుడూ శ్రీదేవి భర్త బోనీ కపూర్ ని విసిగించిన సంఘటనలు కూడా ఉంటాయి. ఇప్పుడు శ్రీదేవి చిన్ననాటి ఫోటో పోస్ట్ చేసిన వర్మ.. "ఈ చిన్ని అమ్మాయి భారతీయ సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అవుతుందని ఎవరు ఊహించగలరు? శ్రీదేవి ఓ అద్భుతం" అంటూ ట్వీట్ చేశాడు.
తన పేరెంట్స్ తో కలిసి శ్రీదేవి దిగిన చిన్ననాటి ఫోటో ఇది. చూడచక్కగా ఉన్న బుల్లి శ్రీదేవి ఈ ఫోటోలో దర్శనమిస్తుంది. వర్మ ఫీలింగ్ కి ఎవరైనా సపోర్ట్ చేయాల్సిందే. రెండు మూడు అర్ధాలు వచ్చేలా.. లేకపోతే వెటకారం లేకుండా.. ఈ మధ్య కాలంలో వర్మ చేసిన ట్వీట్ ఇదే అనుకోవచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/