అతడికి అసిస్టెంటుగా చేరతానంటున్న వర్మ

Update: 2018-01-09 05:12 GMT
తనకు ఆవేశం వస్తే చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఎవరినైనా హద్దుల్లేని రీతిలో పొగిడేస్తాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు ఆయన దృష్టి వివాదాస్పద విమర్శకుడు.. ఫిలిం మేకర్ మహేష్ కత్తిని ఓ టీవీ ఛానెల్ చర్చలో ఉక్కిరి బిక్కిరి చేసిన వివేక్ కృష్ణ మీద పడింది. ఈ వివేక్ ఎవరో కాదు.. రామ్ గోపాల్ వర్మ శిష్యుడే. అతను వర్మ నిర్మాణంలో అక్కినేని నాగచైతన్య హీరోగా ‘బెజవాడ’ అనే సినిమా కూడా తీశాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. వివేక్ అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడు మహేష్ కత్తితో డిస్కషన్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఎవ్వరూ కార్నర్ చేయలేని కత్తిని వివేక్ కార్నర్ చేసే సరికి పవన్ అభిమానులు అతడిని ఆకాశానికెత్తేస్తున్నారు.

వర్మ సైతం తన శిష్యుడిని తెగ పొగిడేశాడు. ‘‘ఎంకే (మహేష్ కత్తి) నుంచి పీకే (పవన్ కళ్యాణ్)ను డిఫెండ్ చేయడంలో నా అసిస్టెంట్ కేవలం ఒక హీరోగా కాదు.. సూపర్ డూపర్ హీరోగా కనిపించాడు. ఎంకే భయపడి పారిపోయేలా చేయడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. ఇది చూశాక నేను వివేక్ అసిస్టెంటుగా చేరాలని అనిపిస్తోంది. ఈ వివాదంతో వెలుగులోకి వచ్చిన వివేక్ ఎంతో ప్రతిభావంతుడు. నేను అతడితో నిర్మించిన సినిమా సరిగా ఆడలేదు. అందుకే నేను అతడి పనిలో జోక్యం చేసుకోవడమే. నేను నా జీవితంలో కలిసిన వాళ్లలో అత్యంత పరిజ్ఞానం - ఇంటెన్సిటీ ఉన్న వ్యక్తి వివేకే’’ అంటూ తన శిష్యుడిపై ప్రశంసల జల్లు కురిపించాడు వర్మ. మరోవైపు పవన్ అభిమానులు సైతం వివేక్‌ ను సామాజిక మాధ్యమాల్లో తెగ పొగుడుతున్నారు.
Tags:    

Similar News