తనదైన శైలిలో కలకలం రేకెత్తించే వ్యాఖ్యలకు పెట్టింది పేరయిన దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ రేంజ్‌లో నచ్చేశారు. హైదరాబాద్‌లో కలకలం రేకెత్తిస్తున్న డ్రగ్స్ మాఫియాపై సమీక్షిస్తూ డ్రగ్స్ వాడేవారిని నిందితులుగా వాడేందుకు కాకుండా బాధితులుగా చూడాలని కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై తనదైన శైలిలో వర్మ స్పందించారు. కేసీఆర్ అద్భుతమైన విజన్ ఉన్న నాయకుడని వర్మ ప్రశంసల వర్షం కురిపించారు.
సినీ వర్గాలను టార్గెట్ చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోని ప్రత్యేక విచారణ బృందం తీరు సాగుతోందని వర్మ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత వర్మ రియాక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన విజన్ తో ముందుకు సాగుతున్నారని పేర్కొంటూ విచారణలో భాగమైన అధికారులకు సైతం అదే ఆలోచన తీరు అవసరమని కోరారు. అలా జరిగినప్పుడే నిష్పక్షపాత దర్యాప్తుకు అవకాశం దొరుకుతుందని వర్మ విశ్లేషించారు.