నిన్ననే చాన్నాళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. పవన్ ను ఆకాశానికెత్తేస్తూ.. అతనుండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమంటూ ఉదయం తనదైన శైలిలో అతిగా పొగిడేసిన వర్మ.. రాత్రికి మళ్లీ పార్టీ మార్చేసి సినిమాల మీదికి వచ్చేశాడు. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ మీద పడ్డాడు. నిన్న రాత్రి ఎన్టీఆర్ మూవీ ‘జనతా గ్యారేజ్’ చూశాడట వర్మ. సీనియర్ ఎన్టీఆర్ లాగా కేవలం మాస్ చుట్టూనే తిరగకుండా తన పరిధిని జూనియర్ ఎన్టీఆర్ బాగా విస్తరిస్తున్నాడని అంటున్నాడు వర్మ. ఈ విషయంలో సుకుమార్ ఎన్టీఆర్ రూటు మార్చాడని కితాబిచ్చాడు.
‘‘ఇప్పుడే జనతా గ్యారేజ్ చూశాను. జూనియర్ ఎన్టీఆర్ క్లాస్ ఆడియన్స్ లోకి చొచ్చుకెళ్తున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ మాస్ చుట్టూనే తిరిగేవాడు. సీనియర్ ఎన్టీఆర్ లాగా పాత దారిలో ఉన్న ఎన్టీఆర్ ను ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ద్వారా కొత్త దారి వైపు మళ్లించాడు సుకుమార్. ఆ ప్రభావం ‘జనతా గ్యారేజ్’లో బాగా కనిపించింది’’ అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. మామూలుగా వర్మ చాలా అతిశయోక్తులు చెబుతుంటాడు కానీ.. తారక్ విషయంలో మాత్రం కరెక్టుగానే చెప్పాడు. ఇంతకుముందు ఎన్టీఆర్ రొటీన్ మాస్ మసాలా సినిమాలకే పరిమితం కావడం వల్ల క్లాస్ ఆడియన్స్ లో అతడికి అంతగా ఫాలోయింగ్ ఉండేది కాదు. ‘నాన్నకు ప్రేమతో’ అతణ్ని ఆ వర్గం ప్రేక్షకులకు చేరువ చేసింది. ‘జనతా గ్యారేజ్’ వారికి తారక్ ను మరింత దగ్గర చేసిందన్నది వాస్తవం.