పూరి జగన్నాథ్ సినిమాలకు తను చేసుకునే పబ్లిసిటీ కన్నా అతడి గురువు రామ్ గోపాల్ వర్మ చేసే పబ్లిసిటీ ఎక్కువుంటుంది. టెంపర్ - జ్యోతిలక్ష్మి సినిమాల్ని వర్మ ఎంతగా ప్రమోట్ చేశాడు.. ఆ ప్రమోషన్ వల్ల ఆ సినిమాలకు ఎంత ప్రయోజనం చేకూరిందన్నది అందరికీ తెలుసు. ఇప్పుడిక ఆయన దృష్టి ‘లోఫర్’ మీద పడింది. లోఫర్ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయినప్పటి నుంచి వాటి గురించి.. తన శిష్యుడి టేకింగ్ గురించి.. హీరో వరుణ్ తేజ్ పెర్ఫామెన్స్ గురించి తెగ పొగిడేస్తున్నాడు వర్మ. మొన్న ‘లోఫర్’ ఆడియో ఫంక్షన్ లో సైతం ఆయనే హైలైట్ అయ్యారు.
అంతా బాగానే ఉంది కానీ.. తన శిష్యుడి సినిమా వస్తున్న మరుసటి రోజే రాబోతున్న తన సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’ గురించే ఆయనేమీ మాట్లాడ్డం లేదు. ఈ నెల 4నే రావాల్సిన ఈ సినిమా వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి గొడవ కారణంగా వాయిదా పడింది. 11న రిలీజ్ చేద్దామంటే హడావుడి అయిపోతుందని.. 18కి వాయిదా వేశారు. అదే రోజు లోఫర్ వస్తుందని తెలిసినా ఆశ్చర్యంగా ఆ డేటుకే ఫిక్సయ్యాడు వర్మ. గురువు మీద గౌరవంతోనో, ఇంకో కారణంతోనో ‘లోఫర్’ను ఇంకో రోజు ముందుకు జరుపుకున్నాడు పూరి. ఐతే పూరి సినిమా వల్ల తన సినిమాకు ఇబ్బందయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ.. ‘కిల్లింగ్ వీరప్పన్’ సంగతి వదిలేసి.. ‘లోఫర్’నే ప్రమోట్ చేస్తుండటం విశేషమే. అందుకే వర్మ గ్రేటండీ బాబూ!