దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వరస ఫెయిల్యూర్స్ అందుకుంటున్నా అతని ప్రభావంతో సినిమా రంగంలోకి ప్రవేశించి శిష్యరికం చేసిన నవ తరం దర్శకులు మాత్రం టాలీవుడ్ కు కొత్త పోకడను పరిచయం చేస్తూ విజయాలు అందుకుంటున్నారు. పూరి తో మొదలుకుని ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దాకా ఎందరో మనకు ఉదాహరణలుగా కనిపిస్తారు. వర్మ కూడా తన శిష్యుల సక్సెస్ ని అదే విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తాజాగా బాక్స్ ఆఫీస్ వద్ద చిరు వానగా మొదలై వసూళ్ల తుఫానుగా మారిన ఆరెక్స్ 100 మీద వర్మ తన ట్విట్టర్ లో వరసబెట్టి ప్రమోషనల్ మెసేజులు పెట్టేస్తున్నాడు.
ఐదేళ్లు వర్మ దగ్గ పనిచేసిన అజయ్ భూపతి వర్మ ప్రస్తావన లేకుండా ఇంటర్వ్యూ ఇవ్వడు. తన మొదటి సినిమా టైటిల్ కార్డ్స్ లో వర్మ పేరు వేసి గురు భక్తిని చాటుకున్నాడు కూడా. ఇంత చేసిన అజయ్ కోసం వర్మ ట్విట్టర్ లో ఆ మాత్రం సాయం చేయలేడా. అందుకే ఇలా ట్వీట్లతో హోరెత్తిస్తున్నాడు . విడుదలైన రోజు నుంచి ఏదో ఒక మెసేజ్ ఆరెక్స్ 100 గురించి పెడుతున్న వర్మ నిన్న ఏకంగా అజయ్ భూపతిని ప్రభాస్ తో పోల్చడమే కాక ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఇతని సక్సెస్ ప్లస్ యాటిట్యూడ్ వల్ల అమ్మాయిల ఫాలోయింగ్ పెరిగిపోయిందని పెట్టి మరో షాక్ ఇచ్చాడు. అంతే కాదు టికెట్ కౌంటర్ల దగ్గర ఎంత రద్దీ ఉందొ చూపించే ఫొటోలతో పాటు మెగా అంటూ విక్టరీ అంటూ ఇన్ డైరెక్ట్ గా పంచులు కూడా వేస్తున్నాడు. మొత్తానికి వర్మ తన శిష్యుడి బైక్ కి సోషల్ మీడియా ద్వారా ఫుల్ గా పెట్రోల్ పోస్తున్నాడు.
ఆఫీసర్ దారుణ పరాజయం తర్వాత వర్మ యాక్టివ్ గా ఉండటం మానేసాడు. దాని వసూళ్లు నాగార్జున కెరీర్లోనే అతి తక్కువగా రికార్డు కావడంతో అభిమానుల ఆగ్రహం మాములుగా లేదు. మొత్తానికి ఆరెక్స్ 100 పుణ్యమా అని వర్మ మళ్ళి లైమ్ లైట్ లోకి వచ్చేసాడు. కాకపోతే ఇంతకు ముందులాగే వెటకారాలు టార్గెట్లు కంటిన్యూ చేస్తాడో లేదో వెయిట్ చేసి చూడాలి. వర్మ ప్రశంశలకు హీరో కార్తికేయ దర్శకుడు అజయ్ భూపతి తెగ ఆనందపడుతున్నారు. అవును మరి గురువు ఈ రేంజ్ లో పొగిడితే శిష్యుడికి అంత కన్నా కావలసింది ఏముంటుంది.