వర్మను యూఎస్ నుంచి బెదిరించిన లేడీ

Update: 2017-09-17 06:15 GMT
రాంగోపాల్ వర్మను బెదిరించడమా.. కేవలం తన పోస్టులతోనే చాలామందికి నిద్దర లేకుండా చేసే వర్మను ఓ మహిళ హెచ్చరించడమా.. అది కూడా ఎక్కడో అమెరికా ఉంటూ ఇండియాలో ఉన్న ఈ సెన్సేషనల్ డైరెక్టర్ కు బెదిరింపులు పంపడమా.. అసలివన్నీ సాధ్యమేనా అనిపించడంలో ఇసుమంతైనా ఆశ్చర్యం లేదు.

అయితే.. ఈ విషయాన్ని చెప్పిన వ్యక్తి కూడా వర్మే కాబట్టి.. నమ్మేద్దాం. ఇంతకీ అసలేం జరిగిందంటే.. వర్మ రీసెంట్ గా ఓ చిన్నపాటి వీడియోను పోస్ట్ చేశాడు. అందులో వర్మ కూతురు రేవతి జిమ్ చేస్తున్న విజువల్స్ ఉంటాయి. పైగా 'నన్ను కొట్టేందుకు నా కూతురు వర్కవుట్స్ చేస్తోంద'ని కామెంట్ కూడా చేశాడు. దీంతో కోపం వచ్చిన ఆ కూతురు.. 'పర్సనల్ గా షేర్ చేసిన వీడియోను.. నువ్వు పబ్లిక్ లో ఎందుకు పోస్ట్ చేశావు.. వెంటనే డిలెట్ చెయ్.. లేకపోతే అమెరికా నుంచి వచ్చి మరీ నిన్ను కొట్టాల్సి ఉంటుంది' అంటూ కామెంట్ పెట్టింది. అలాగని వర్మ తగ్గిపోయి.. బెదిరిపోయి.. వెంటనే వీడియో డిలెట్ చేసే బాపతు కాదు కదా.

అందుకే తను చిన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నప్పటి ఫోటో ఒకటి పోస్ట్ చేసి.. మళ్లీ అప్పటి రోజులను గుర్తు చేసుకుంటున్నట్లు.. కూతురుతో ఫైటింగ్ కు రెడీ అవుతున్నట్లు ఇన్ డైరెక్టుగా చెప్పాడు వర్మ. ఏమైనా ఒక ఇష్యూను అలా అలా కొనసాగించడంలో.. వర్మకు సాటి మరొకరు లేరంతే.

Full View
Tags:    

Similar News