రాంగోపాల్ వర్మ చాలానే కామెంట్స్ చేస్తుంటాడు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఈ జోరు మరీ ఎక్కువైంది. అయితే.. ఎక్కువగా మెగా.. సూపర్ స్టార్లు అంటూనే కామెంట్ చేసే వర్మ.. అక్కినేని హీరోల జోలికి అస్సలు వెళ్లడనే చెప్పాలి. అక్కినేని నాగార్జునతో శివ టైం నుంచి ఉన్న రిలేషన్ కారణంగానే.. వారిపై నెగిటివ్ కామెంట్స్ చేయడు వర్మ.
పైగా ఇప్పుడు నాగార్జునతో ఓ సినిమాను మరో మూడు రోజుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇలాంటి సమయంలో అఖిల్ రెండో సినిమాపై తన సోషల్ మీడియా పేజ్ లో ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు వర్మ. ఈ ప్రాజెక్టుతో లింక్ అయిన వాళ్లందరూ తమ మనసు చెప్పింది చేశారే తప్ప.. అరిగిపోయిన మూస పద్ధతుల వైపు వెళ్లలేదన్నాడు ఈ దర్శకుడు. వ్యూయర్ ఇంప్రెస్ చేయలేమేమో అనే భయాన్ని పెట్టుకోకుండా.. నిజాయితీగా.. తాము చూపించాలనుకునే సినిమాను అందించనున్నారని అన్నాడు.
విక్రమ్ కె కుమార్ షూస్ పట్టుకోవాలన్న వర్మ.. అఖిల్ పై చేసిన కామెంట్స్ మరీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. "హేయ్ అఖిల్ అక్కినేని.. నీలో ఉన్న ఈ ట్యాలెంట్స్ అన్నీ మొదటి సినిమా విషయంలో ఎక్కడ దాచి పెట్టావ్.. మొత్తానికి నువ్వేంటో చూపించబోతున్నావ్. డిసెంబర్ 22న నాతో సహా ఆఢియన్స్ అందరూ మెస్మరైజ్ కావడం ఖాయం" అన్నాడు వర్మ.