వివాదాలతో నిత్యం వార్తల్లో కనిపించే దర్శకుడిగా రాంగోపాల్ వర్మ కనిపిస్తారు. తన మాటలే కాదు.. ఆయన తీసే సినిమాలు.. తీయాలనుకునే సినిమాలు తరచూ భారీ చర్చకు తెర తీస్తుంటాయి. సినిమా విడుదలైన తర్వాత చర్చ సంగతి పక్కన పెడితే.. అనౌన్స్ చేసిన వెంటనే భారీ ఎత్తున చర్చలు షురూ అవుతాయి. తాజాగా ఆయన తీయాలనుకుంటున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో కీలకమైన చంద్రబాబు క్యారెక్టర్‌ను ఎవరు పోషిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గామారింది.
ఎన్టీఆర్ బయోపిక్ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ చర్చ జరుగుతుంటే.. ఎప్పుడైతే వర్మ తన మూవీ పేరును అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమా మీద ప్రతి తెలుగోడు మాట్లాడుకునేలా చేసింది. ఎప్పుడైతే ఈ సినిమాకు లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న పేరును వర్మ ఫిక్స్ చేశారో.. ఈ సినిమా మీద చర్చ పీక్స్‌కు వెళ్లేలా చేసింది.
ఎన్టీఆర్ క్యారెక్టర్ ను ఎవరు పోషిస్తున్నారన్న ప్రశ్నకు వర్మ రియాక్ట్ అవుతూ.. కొత్తవ్యక్తి అవుతాడని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తాజాగా ఈ మూవీలో చంద్రబాబు పాత్ర ఎవరు పోషిస్తున్నారన్న అంశంపై సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది.
వర్మకు క్లోజ్ ఫ్రెండ్.. ఆయన సినిమాల్లో కీలక పాత్రలు పోషించే జేడీ చక్రవర్తిని చంద్రబాబు క్యారెక్టర్ కు ప్రపోజ్ చేసినట్లుగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక.. లక్ష్మీపార్వతి క్యారెక్టర్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా చేస్తున్నట్లుగా వార్తలు వచ్చినప్పటికీ.. అలాంటిదేమీ లేదని.. తనను ఎవరూ సంప్రదించలేదని రోజా వివరణ ఇచ్చారు.
ఒకవేళ.. వర్మ కానీ తనను ఆ పాత్ర చేయమని కోరితే తాను స్పందిస్తానని రోజా చెప్పారు. ఇలా వర్మ తీయబోయే సినిమాకు సంబంధించి పలు పాత్రల మీద భారీ చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు పాత్రను జేడీ చక్రవర్తి నటిస్తున్నాడన్న అంశంపై వర్మ తాజాగా రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా చంద్రబాబుపాత్రను జేడీ చక్రవర్తి పోషిస్తున్నారనటం ఎంతమాత్రం నిజం కాదన్నారు. ఈ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న వర్మ.. బాబు పాత్రను ఎవరు పోషించాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న వర్మ.. తనకు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మధ్య ఎవరో నటిస్తున్నారన్నారు. ఆ విషయం తనకు కూడా తెలీదనటం గమనార్హం. అయితే.. నటిస్తున్నది జేడీ మాత్రం కాదని తేల్చి చెప్పారు. వర్మనే ఇంత ఓపెన్ గా డిక్లేర్ చేశారంటే.. కచ్ఛితంగా బాబు పాత్రకు జేడీ నటించే అవకాశం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బాబు పాత్రను ఎవరు నటిస్తున్నారన్న అంశంపై ఆసక్తికరంగా చర్చ సాగుతుంటే.. ఎన్టీఆర్ నుంచి బాబుకు అధికార బదిలీ జరగటంతో కీలకభూమిక పోషించిన వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ గురించి తనకు సరైన అవగాహన లేదని వర్మ పేర్కొనటం గమనార్హం. తెలుగు రాజకీయాల్లో కీలకఘట్టమైన వైస్రాయ్ ఎపిసోడ్ మీద అవగాహన లేకుండానే ఎన్టీఆర్ జీవిత చరిత్రను తీయాలనుకుంటున్నారా? అన్నది ప్రశ్నగా చెప్పక తప్పదు. ఇప్పటికే పలు అంశాల మీద ఈ సినిమా చర్చ సాగుతున్న వేళ.. వర్మ వ్యాఖ్యలు మరింత ఆసక్తికర చర్చకు తెర తీస్తాయనటంలో సందేహం లేదు.