ఏప్రిల్ 7.. ఒక అద్భుతం జరగబోతోంది

Update: 2017-02-09 04:32 GMT
సగటు మనిషికి పూర్తి భిన్నంగా ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. అందరిలాగా ఆయనకు సెంటిమెంట్లు ఉండవు. పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడాల్లాంటి వాటికి పూర్తి దూరంగా ఉంటాడు వర్మ. బర్త్ డే వస్తోందంటే తన ఆయుర్దాయం ఒక ఏడాది తగ్గిపోయిందని ఫీలవుతుంటాడు వర్మ. నాకు ప్రతి రోజూ వేడుకే అయినప్పుడు.. ప్రత్యేకంగా బర్త్ డే వేడుక చేసుకోవడం ఏంటి అని కూడా ప్రశ్నిస్తుంటాడు వర్మ. తన దృష్టిలో తన పుట్టిన రోజుకు ఎలాంటి ప్రాధాన్యతా లేదని కూడా చెబుతాడు. మన పుట్టిన రోజును ఇంకొకరు వేడుకగా జరుపుకోవాలి తప్ప మనం చేసుకోకూడదన్నది వర్మ అభిమతం. ఐతే ఈ ఏప్రిల్ 7న వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఒక చిత్రం చోటు చేసుకోబోతోంది.

వర్మ పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఆయన కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘సర్కార్-3’ సినిమా విడుదల కాబోతోంది. ఇది నిజంగా అనూహ్యమైన విషయమే. మామూలుగా చూస్తే వర్మ ఇలాంటి వాటికి దూరం. మరి ఈ విషయంలో నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనలే బలవంతం చేసి సినిమాను వర్మ పుట్టిన రోజుకు రిలీజ్ చేస్తోందేమో. దీనికి వర్మ అంగీకరించడం కూడా విశేషమే. 25 ఏళ్ల తన కెరీర్లో తొలిసారి ఇలా తన పుట్టిన రోజుకు తన సినిమా విడుదలవుతోందని.. తనకు అందరూ హ్యాపీ ఏప్రిల్ 7 అని చెప్పాలని వర్మ చమత్కరించాడు. ముందు ఈ సినిమాను మార్చి 17నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఏప్రిల్ 7కు విడుదల తేదీని మార్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News