మనోళ్ళకు పంచ్ వేశాడుగా...

Update: 2017-05-03 04:50 GMT
దర్శకుడు రామ్ గోపాల వర్మ ట్విటర్ పేజీని ఒక మీడియా హౌస్ గా చెప్పవచ్చు. అతను చేసిన ఒక్క ట్వీట్ కొన్ని రోజులు చర్చించుకోవచ్చు. అవతల వాళ్ల మీదా తన చుట్టూ జరుగుతున్నవాటి మీద ఆ రేంజులో ట్వీట్లేస్తాడు మరి. అందులో నిజం ఉంది కాబట్టే అలా మాట్లాడతాడా.. లేకపోతే తనకి తిక్కరేగి అలా అంటాడా అనేది చదివినవాళ్ల విచక్షణకు వదిలివేయాలి.

బాహుబలి 2 విజయానికి చాలా ఉబ్బి తబ్బి అయిపోయి.. ఒక బాలీవుడ్ బాబు ఏమన్నాడంటే.. ''హింది సినిమా హిస్టరి లో  మొదటిసారి ఒక సౌత్ హీరో ముందు నార్త్ హీరోలుంతా హీరోయిన్స్ లా కనిపిస్తున్నారు'' అని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ లో హీరో పై  అభిమానంతో అలానేశాడు అని అనుకుందాం. లేదంటే తమ నార్త్ హీరోలు ఇలాంటి హిట్టు కొట్టలేకపోయారనే బాధతోనే అలా అన్నాడని అనుకుందాం. దానికి మన రాము కాస్త తన పద్దతి లోనే చెప్పాడు  ''బాబు నీవు ఒక  అబద్ధమును నిజమలా నమ్మి దాని వలనే బాహుబలి విజయం పొందింది అని అనుకోవడం ..ఆ మత్తులో ఇలా మాట్లాడుతున్నావ్. ముందు వాస్తవాలు తెలుసుకొని  కంటెంట్ అర్ధంచేసుకో. అలాగే నార్త్ సౌత్ అంటూ లేనిపోని అడ్డంకులు క్రియేట్ చేయకు'' అని చెప్పాడు.

సాధారణంగా ప్రతీ విషయంపై కామెడీ  చేసే రాము.. ఈ మ్యాటర్లో మాత్రం సున్నితంగా సలహాలు భలే ఇచ్చాడే. అయితే పంచ్ మన హీరోలకు వేశాడు. ''త్వరలోనే మెగాస్టార్లు పవర్ స్టార్లు ఒక ప్యాన్ ఇండియన్ సినిమా తీసి.. తాము ఇండియావైడ్ ప్రభాస్ కంటే పెద్ద హీరోలమని ప్రూవ్ చేసుకోవాలి'' అంటూ ట్వీటేశాడు. వామ్మో సంపేశాడుగా!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News