'కాటమరాయుడు' పై వర్మ తీవ్ర వ్యాఖ్యలు?

Update: 2017-03-25 10:51 GMT
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిపై ప్రేమ కురిపిస్తాడో.. ఎవరిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తాడో అంచనా వేయలేం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఆయన ఎంత అభిమానం చూపించేవాడో.. పవర్ స్టార్ ను ఏ రేంజిలో పొగిడేసేవాడో గుర్తుండే ఉంటుంది. కానీ కొంత కాలంగా పవన్ కళ్యాణ్ ను.. పవన్ కళ్యాణ్ సినిమాల్ని టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నాడు వర్మ. తాజాగా ఆయన కళ్లు ‘కాటమరాయుడు’ మీద పడ్డాయి. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో వర్మ దాన్ని టార్గెట్ చేశాడు. ఈసారి ఆయన వ్యాఖ్యలు మరీ శ్రుతి మించి పోయాయి.

తనతో ఎవరో 70 ఏళ్ల వ్యక్తి వచ్చి ‘కాటమరాయుడు’ చూడటం కంటే పోర్న్ సినిమా చూడటం మేలని అన్నాడట. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నందుకు గర్వపడటం మాని.. ఒక మంచి సినిమాను ప్రొడ్యూస్ చేయాలట. పవన్ అభిమానులు గొర్రెల్లాంటి వాళ్లని.. వాళ్లకు ఎంత చెప్పినా వేస్ట్ అనే అర్థం వచ్చేలా కూడా వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పవన్ బాహుబలి-2 ట్రైలర్ చూశాక కొంత అయినా నేర్చుకుని.. దానికి తగ్గట్లుగా సినిమాలు తీయాలని సలహా ఇచ్చాడు వర్మ. ఐతే ఈ వ్యాఖ్యలన్నీ సూటిగా చేయలేదు వర్మ. ఎవరో సుబ్బారావు అన్నాడని.. ఇంకెవరో జ్నానేశ్వర్ చెప్పాడని.. తన పనిమనిషి అందని.. ఇలా ఎవరెవ్వరి పేర్లో వాడాడు. ఎక్కడా కూడా కాటమరాయుడు పూర్తి పేరు ఉపయోగించలేదు. పవన్ కళ్యాణ్ పేరూ ఎత్తలేదు. కానీ ఏం చెప్పాలనుకున్నాడో మాత్రం చెప్పేశాడు. ఈ వ్యాఖ్యలపై మండిపోయిన అభిమానులు ఆయన్ని తీవ్రంగా తిట్టిపోస్తున్నా వర్మ చలించట్లేదు. వాళ్ల మీద తిరిగి ట్వీట్ బాణాలు వదిలాడు. చూస్తుంటే వర్మ వెర్సస్ పవన్ ఫ్యాన్స్ వ్యవహారం తీవ్ర రూపం దాల్చేలా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News