హోలీపై వర్మ స్టైల్ పంచ్

Update: 2016-03-24 09:10 GMT
ఏ సందర్భాన్ని అయినా.. ప్రత్యేకమైన దృష్టితో చూడ్డం సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అలవాటు. ఈ మధ్య వరుసగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ట్వీట్స్ పెట్టి వర్మకు విసుగు వచ్చేసినట్లుంది. అందుకే ఇప్పుడు తన అటెన్షన్ ని మార్చాడు. పండుగల మీదకు దృష్టి మళ్లించాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు జరుగుతుండడంతో.. దీనిపైనే ఫోకస్ పెట్టాడు.

'ఎవరు ఎవరిని ఏ కారణంతో చంపారో తెలీకుండానే హోలీ పండగను సెలబ్రేట్ చేసుకుంటున్నాం.. గ్రేట్.. అయినా.. ఏ కారణం లేకపోవడమే ఎంజాయ్ చేయడానికి అతి పెద్ద కారణం కదా... హ్యాపీ హోలీ' అని ట్వీట్ చేశాడు వర్మ. విభిన్నంగా ఆలోచించే వర్మ.. ఇంతటితో ఆగిపోతే ఆసలు వర్మ ఎందుకు అవుతాడు..అందుకే అసలు పంచ్ తర్వాత ట్వీట్ లో వేశాడు. 'హోలీ పండుగలో ఉండే ఒకే ఒక మంచి విషయం ఏంటంటే.. తడి బట్టల్లో అమ్మాయిల అందాలను కామంతో చూసేందుకు.. పెద్దలు పర్మిషన్ ఇచ్చే పవిత్రమైన రోజు ఇది. ఇలా చూసినా దెబ్బలు పడవు కూడా..' అన్నాడు వర్మ.

దటీజ్ వర్మ.. ఆలోచిస్తే వర్మ చెప్పేదాంట్లో నిజం ఉందని అనిపించక మానదు. పండుగ పేరుతో మహిళల అందాలను ప్రదర్శనకు పెట్టించేయడం అంత కరెక్ట్ కాదు కదా. ఈ పండుగలో ఉన్న ఓ మైనస్ ను.. తనదైన స్టైల్ లో వర్మ ఎత్తి చూపించాడు.
Tags:    

Similar News