దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు చూడండి.. మనం ఏం చేస్తాడని అనుకుంటే దానికంటే అతి చేస్తుంటాడు. అయితే కొన్నిసార్లు నిజాన్ని పట్టుకునే కామెంట్లు చేస్తుంటాడు. కాకపోతే అది కూడా అతిగానే ఉంటుంది. తన పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్పినవారిపై కూడా.. కోపంగా ఉందని.. ఎందుకంటే తన ఏజ్ ఇంకా వన్ ఇయర్ పెరిగింది కాబట్టి బాధగా ఉందంటూ కామెంట్లు చేశాడు.
అయితే వాటికంటే ముందే.. శ్రీదేవిని ఒక చిన్నపాపగా అభివర్ణించిన రాము.. ఇప్పుడు లక్స్ యాడ్ తో శ్రీదేవి మీద కామెడీ మొదలెట్టేశాడు. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ యుగంలో.. పేపర్లో వచ్చిన ఒక లక్స్ యాడ్ షేర్ చేశాడు ఈ దర్శకుడు. అందులో శ్రీదేవి ఫోటో ఉండి.. శ్రీదేవి కలర్ కు ఈ లక్స్ సబ్బే కారణంగా అంటూ క్యాప్షన్ ఉంది. ఓ ఆమె రంగుకి లక్స్ సోప్ కారణమా అంటూ ఇప్పుడు మనోడు పిచ్చ కామెడీ చేస్తున్నాడు.
అసలు నల్లగా ఉంటే తప్పు అన్నట్లు.. కలర్ ఉంటేనే మనిషి అన్నట్లు.. ఈ సబ్బులు యాడ్లు ఒక విధంగా రేసిజం (జాత్యాంహకారం)ను ప్రోత్సహిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు శ్రీదేవి రంగు గురించి సంబరాలు చేసుకోకుండా.. అసలు ఈ రంగు పేరుతో జరుతున్న వివక్ష గురించి మాట్లాడితే బాగుంటుందేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/