‘అర్జున్ రెడ్డి’ సినిమా పోస్టర్ల పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ - కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ ల మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఆ చిత్రం విడుదల కాకముందు ప్రారంభమైన వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కేటీఆర్ కు హీరో విజయ్ బంధువవడం వల్లే ఆ సినిమాను కేటీఆర్ మెచ్చుకున్నాడని వీహెచ్ ఆరోపించారు. వీహెచ్ వ్యాఖ్యలకు స్పందిస్తూ విజయ్ ... చిల్ తాతయ్య అంటూ మరో సారి వ్యంగ్యంగా పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వీహెచ్ పై వర్మ మరోసారి సెటైర్ లు వేశాడు. అర్జున్ రెడ్డి సినిమాలోని ముద్దు సీన్లన్నింటినీ ఒక పెన్ డ్రైవ్ లో వేసి వీహెచ్ కు ఇవ్వాలని ఆ చిత్ర యూనిట్ కు సలహా ఇచ్చారు. పవన్ కల్యాణ్ కన్నా విజయ్ 10 రెట్లు బెటర్ అని వర్మ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సారి వర్మ ఏకంగా హాలీవుడ్ హీరోతో విజయ్ ను పోల్చేశాడు. విజయ్ ను ఆకాశానికెత్తేస్తూ తాజాగా ఫేస్ బుక్ లో మరో పోస్ట్ పెట్టాడు. ‘‘అర్జున్ రెడ్డి’ చిత్ర యూనిట్ కి నేను ఒక సలహా ఇస్తున్నాను. మీ సినిమాలో ఉన్న ముద్దు సీన్లన్నింటినీ కట్ చేసి ఒక పెన్ డ్రైవ్ లో వేసి తాతయ్యకు ఇచ్చేయండి. ఆయన వాటిని ఇంట్లో తన గదిలో ఒక్కరే చూసుకుని తప్పకుండా చిల్ అవుతారు’ అంటూ వర్మ వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు. తన దైన శైలిలో వీహెచ్ పై వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘అర్జున్ రెడ్డి’ మూవీని మరోసారి చేశానని, విజయ్ దేవరకొండను టాలీవుడ్ లియోనార్డో డికాప్రియో అని చెప్పేందుకు తనకు ఎటువంటి అనుమానం లేదని చెప్పాడు. ఫిల్మ్ మేకింగ్ లో ఉన్న స్టాండర్డ్స్ లో మార్పు తెచ్చేందుకు ఈ స్టార్ డమ్ ను విజయ్ ఉపయోగించుకోవాలని కోరాడు. హాలీవుడ్ లో ఇతర నటీనటుల సినిమాలకు భిన్నంగా డికాప్రియో విభిన్న కథలలో నటించాడని, అదే తరహాలో విజయ్ కూడా టాలీవుడ్ లో మార్పు తీసుకురావాలన్నాడు. నాన్ కన్వెన్షనల్ - నాన్ ఫార్మాలిక్ చిత్రాలు చేయడం వల్లే డికాప్రియో సూపర్ స్టార్ అయ్యాడని వర్మ చెప్పాడు.