అంబానీల్లాగే సినిమా వాళ్లు కూడా -వర్మ

Update: 2017-05-04 05:50 GMT
నెపోటిజం.. వారసత్వంగా సినిమా రంగంలోకి రావడం అనే తుట్టెను కంగనా రనౌత్ కదిపినప్పటి నుంచి ఈ టాపిక్ వేడివేడిగా రగులుతూనే ఉంది. ఇప్పటివరకూ అనేక మంది దీనిపై రియాక్ట్ అయ్యారు. నెపోటిజంను వ్యతిరేకించే వారే కాదు.. సపోర్ట్ చేసే వారు అంతకంటే ఎక్కువగానే కనిపించారు. ఇప్పుడు వివాదస్పద వర్మ కూడా తన స్టైల్ లో ఈ టాపిక్ పై స్పందించాడు.

'ధీరూబాయ్ అంబానీ తన సంపద మొత్తాన్ని కేవలం ముఖేష్ జీ.. అనిల్ జీలకు ఇచ్చినపుడు.. స్టార్స్ అందరూ తమ కొడుకులు కూతుళ్లకు ఇస్తే తప్పేంటి. తమ సొంత రక్త సంబంధీకులకు వారసత్వంగా తమ సామాజిక స్థాయిని ఇవ్వడం ప్రజలకు ఆచారంగా వస్తోంది. నెపోటిజంను వ్యతిరేకించడం అంటే మానవతా విలువలకు వ్యతిరేకంగా ఉండడమే. మానవ ధర్మాల్లో వారసత్వం కూడా ఒకటి. ఇదేమీ చెడు విషయం కాదు. రిషి కపూర్ తన కొడుకు రణబీర్ కపూర్ కు కాకుండా.. రోడ్ సైడ్ వ్యక్తికి సాయం చేయడం అసంబద్ధం' అన్నాడు వర్మ.

'నెపోటిజం అంటే దేశభక్తిలో ఓ ముఖ్యమైన భాగం. సొంత కుటుంబాన్ని ప్రేమించడానికి.. సొంత దేశాన్ని ప్రేమించడానికి తేడా ఏంటి' అంటూ నిలదీశాడు వర్మ. సెన్సేషనల్ డైరెక్టర్ వాదన కన్విన్సింగ్ గానే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News