'వర్మ చచ్చిపోయాడు. సిని పరిశ్రమకు పట్టిన పీడ వదిలిపోయింది. పండగ చేసుకోండి' అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది ఇప్పుడు ఆన్ లైన్ లో నానా రచ్చ చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంటపడ్డాయ్. మనోడు ఫీలవుతాడేమో అనుకుంటే.. అలాంటి ట్రాలింగ్ చేస్తున్నవారికే దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు.
''లవ్ యు టు మై డియర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. థ్యాంక్స్. మీ అందరికీ నా కౌగిళింతలు'' అంటూ ఆ ఇమేజ్ ను వర్మ రీట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా.. మరో రెండు కామెంట్లు కూడా చేశాడు. ''నిరాక్షరాస్యులైన గొర్రెలకు తెలియాల్సిన విషయం ఏంటంటే.. నేను మూడు జన్మల క్రితమే చచ్చిపోయాను. అప్పటి నుండి నా ఆత్మ మాత్రమే ఇక్కడుంది. ఆత్మలకు చావు లేదు'' అంటూ వికటాట్టహాసం చేశాడు వర్మ. ఏదైనా కూడా మనోడికే చెల్లిందిలే బాసూ!!
అసలు చెప్పొచ్చే విషయం ఏంటంటే.. ఆల్రెడీ కాటమరాయుడు రిజల్టు కాస్త డివైడ్ టాక్ తో సతమతమవుతున్నప్పుడు.. వర్మను అనవసరంగా ఇరిటేట్ చేయడం అంత మంచిదికాదేమో. మనోడు ఇంకెన్ని కామెంట్లు చేస్తాడో.. ఎలాంటి అనైతిక స్టేట్మెంట్లు ఇస్తాడో చెప్పలేం. ఆ విషయం పికె ఫ్యాన్స్ అర్ధం చేసుకుంటే బెటర్ అంటున్నారు సినిమా పరిశీలకులు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/