నటుడిగా కోట శ్రీనివాసరావు ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో అద్భుతమైన.. విలక్షణమైన పాత్రలు చేశారాయన. కోట ప్రతిభను సరిగ్గా వాడుకున్న దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకడు. శివ.. అనగనగా ఒక రోజు.. గాయం.. ఇలా వర్మ దర్శకత్వంలో కోట చేసిన ప్రతి సినిమాలో ప్రతి పాత్రా ఒక ఆణిముత్యమే. వర్మ బాలీవుడ్ వెళ్లిపోయాక అక్కడికీ కోటను పట్టుకెళ్లాడు. అమితాబ్ బచ్చన్ సినిమా ‘సర్కార్’లో కోటతో ఓ కీలక పాత్ర చేయించాడు. అమితాబ్ బచ్చన్ తో నటించాలన్న తన కలను వర్మ నెరవేర్చాడని.. ఆ సినిమా షూటింగ్ రోజుల్ని ఎప్పటికీ మరిచిపోలేనని అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు కోట.
‘‘ఒక రోజు వర్మ గారు నాకోసం ఫోన్ చేశారంటూ మా అబ్బాయి చెప్పాడు. వెళ్లాను. మీకో శుభ వార్త అంటూ అమితాబ్ బచ్చన్ సినిమాలో తనకో వేషం ఇవ్వబోతున్నట్లు చెప్పాడు వర్మ. నటుడిగా ఎంత స్థాయికి ఎదిగినా.. ఎన్ని నంది అవార్డులు తీసుకున్నా.. అమితాబ్ బచ్చన్ తో నటించడం మాత్రం ఒక కలగా ఉండేది. అది వర్మ ద్వారా తీరింది. బొంబాయిలో ‘సర్కార్’ సెట్ లోకి వెళ్లాం. తొలి రోజు సందడి ఎక్కువగా అనిపించింది. అది కాస్త సద్దుమణిగాక వర్మ గారు నా దగ్గరికొచ్చి బాంబేలో సెటిలయ్యే సౌత్ ఇండియన్ పొలిటీషియన్ పాత్ర నాదని చెప్పాడు. ‘‘నేను సౌత్ వాడిలాగా కనిపిస్తాను.. కానీ నా పనంతా నార్త్ వాడిలానే ఉంటుంది’’ అనేది ఆ క్యారెక్టర్ మేనరిజం అని చెప్పారు. దీనికి తగ్గట్లుగా ఒక వాక్యం చెప్పమన్నాడు వర్మ. వెంటనే.. ‘‘మేరా స్టైల్ సౌత్.. ఆపరేషన్ కంప్లీట్ నార్తే బై’ అనే డైలాగ్ చెప్పా. వర్మ థ్రిల్ అయిపోయాడు. వెంటనే అసిస్టెంట్లను పిలిచి నేను చెప్పేది కరెక్టుగా రాయమన్నాడు. సినిమాలో ఆ డైలాగ్ బాగా పేలింది’’ అని కోట ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/