చ‌ల్లారుతున్న నిప్పును మ‌ళ్లీ రాజేసిన వ‌ర్మ‌

Update: 2017-04-23 16:40 GMT

ఏటా సినీ అవార్డులు వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. వివాదాస్ప‌ద సినీ ప్ర‌ముఖులు ఈ అగ్నికి మ‌రింత ఆజ్యం పోస్తున్నారు. చ‌ల్లారుతున్న స‌మ‌యంలో మ‌రింత‌గా మంట‌లు రాజేస్తున్నారు. తాజాగా వివాదాస్ప‌ద సినీ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ అదేప‌ని చేశారు. కొద్దిరోజులుగా జ‌రుగుతున్న జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల వివాదంలో ఆయ‌న కూడా ఒక రాయేశారు. అమీర్ ఖాన్ కు మ‌ద్ద‌తుగా మాట్లాడి ఈ చ‌ర్చ‌ను ముగియ‌కుండా చేశారు.

64వ జాతీయ చలనచిత్ర అవార్డులపై అసంతృప్తి జ్వాలలు రేగిన సంగ‌తి తెలిసిందే. జ్యూరీ సభ్యులు కొందరి పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ కూడా ఈ అవార్డులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మురుగదాస్ వ్యాఖ్యలపై అవార్డుల జ్యూరీ మెంబర్స్ కమిటీ హెడ్ ప్రియదర్శన్ మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ విష‌యంలో ఎంటరై మ‌రింత వేడి పెంచాడు.  మన దేశంలో ఉన్న గొప్ప ఫిలిం మేకర్లలో అమీర్ ఖాన్ ఒకడని... ఆయనకు అవార్డులు రానంత మాత్రాన ఆయన స్థాయి తగ్గిపోదని అన్నాడు. అమీర్ ప్రతిభను అవార్డుల కమిటీ నిర్ణయంతో కొలవలేమని చెప్పాడు. అసలు ఏ అవార్డుల ఫంక్షన్లకు అమీర్ ఖాన్ హాజరు కాడని అన్నాడు. దీంతో బాలీవుడ్ లో రాజుకున్న ఈ అవార్డుల వివాదం మ‌రింత ముదురుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News