హీరో రామ్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు

Update: 2017-10-22 09:32 GMT
వైఫల్యాల్ని ఒప్పుకోవడానికి గట్స్ ఉండాలి. అందులోనూ సినిమా పరిశ్రమలో వైఫల్యాల్ని ఒప్పుకోవడమంటే అరుదైన విషయమే. యువ కథానాయకుడు రామ్ ఈ సాహసమే చేశాడు. తన కెరీర్లో విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువని అంగీకరించాడు. తన సక్సెస్ రేట్ చాలా తక్కువ అని అతను వ్యాఖ్యానించాడు. రామ్ ఇప్పటిదాకా 14 సినిమాలు చేస్తే.. అందులో విజయవంతమైనవి ఐదు మాత్రమే. ఇది పేలవమైన ట్రాక్ రికార్డే అని రామ్ అన్నాడు. ఐతే తాను ఈ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నానని రామ్ చెప్పాడు. తన కొత్త సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’ తనకు కచ్చితంగా సక్సెస్ అందిస్తుందని అతను ధీమా వ్యక్తం చేశాడు.

‘ఉన్నది ఒకటే జిందగీ’ నుంచి తాను ఏదైతే ఆశించానో అది దర్శకుడు కిషోర్ తిరుమల అందించాడని.. ఇక ఈ సినిమా సక్సెస్ అన్నది బోనస్ గా వస్తుందని ఆశిస్తున్నానని రామ్ అన్నాడు. ‘ఉన్నది ఒకటే జిందగీ’ తన కెరీర్లో ప్రత్యేకమైన సినిమా అని అతను అభిప్రాయపడ్డాడు. ఇది తన మనసుకు దగ్గరైన సినిమా అని చెప్పాడు. ‘నేను శైలజ’ తర్వాత రామ్-కిషోర్ తిరుమల-స్రవంతి రవికిషోర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’. ఈ చిత్రంలో రామ్ రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. ‘నేను శైలజ’ తరహాలోనే ఇది కూడా ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ - లావణ్య త్రిపాఠి జంటగా నటించారు.
Tags:    

Similar News