25వ సినిమా నుండి 15వ సినిమాకు పడింది

Update: 2017-10-25 03:30 GMT
మీడియాలో ఎప్పుడూ ఏదో ఒకటి సంచలనం చేయాల్సిందే. ఒకవేళ సంచలనం అయ్యేది లేకపోతే మాత్రం.. సంచలనం చేయడానికే ప్రయత్నిస్తుంటారు మన జనాలు. అది కూడాను కొన్ని నెంబర్ల విషయంలో మనం భలే చురుకులం తెలుసా. పదండి ఇంతకీ ఈ 25వ సినిమా 15వ సినిమా మ్యాటర్ ఏంటో చూద్దాం.

ఒకప్పుడు సినిమాలు ఎక్కువగా వచ్చేయా అంటే.. ఇప్పుడే ఇంకా ఎక్కువ సినిమాలు తీస్తున్నారు మనోళ్ళు. కాని స్టార్ హీరోలు మాత్రం చేయలేకపోతున్నారు. ఆల్రెడీ మెగాస్టార్ 150వ సినిమాను బాలయ్య బాబు 100వ సినిమాను చేస్తే.. పక్కనే పవన్ కళ్యాణ్‌ అండ్ మహేష్‌ 25వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే.. ఇప్పుడు 25వ సినిమాకు దగ్గర్లో లేని హీరోలు తారసపడితే.. మన మీడియావోళ్లు వెంటనే సార్ మీ 15వ సినిమా ఎప్పుడు అంటూ ఆ పదిహేను అనే నెంబర్ ను కూడా హైలైట్ చేసే కార్యక్రమానికి తెరలేపారు. అదిగో ఇప్పటికి 14 సినిమాలను తీసిన రామ్ ను.. ఇప్పుడు అదే ప్రశ్న అడిగారు.

అక్కడ మనం రెండు విషయాలు అనుకోవచ్చు. అసలు 15వ సినిమాను అంతగా నొక్కి చెబుతుంటే.. అంతకంటే ఎక్కువ సినిమాలు చేసి 25 అనే నెంబర్ దగ్గరకు రావడానికి లేట్ అవుతుందనా.. లేదంటే 5వ ఎక్కంలో ఏ అంకె కనిపించినా అది మాకు సంచలనమే అనుకుంటారా వీళ్ళు? ఏంటో మరి వారికే తెలియాలి.


Tags:    

Similar News