తనకు ఎనర్జిటిక్ స్టార్ అన్న బిరుదివ్వడం నచ్చలేదు అంటున్నాడు యువ కథానాయకుడు రామ్. అసలు అదనే కాదు.. తన పేరు ముందు ఏ బిరుదూ అవసరం లేదని అతనన్నాడు. అభిమానుల కోసం తప్పక టైటిల్స్ పడేటపుడు ‘ఎనర్జిటిక్ స్టార్’ అని వేయడానికి ఒప్పుకుంటున్నట్లు రామ్ చెప్పాడు. ఇన్నాళ్లూ రామ్ ను అందరూ ‘ఎనర్జిటిక్ స్టార్’ అన్నారని.. ‘హైపర్’ సినిమా తర్వాత ‘హైపర్ స్టార్’ అంటారని ఈ చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ అన్న నేపథ్యంలో రామ్ ఈ బిరుదుల విషయమై స్పందించాడు.
‘‘నేను ఎనర్జిటిక్ స్టార్ అనిపించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా నేనేమీ చేయలేదు. నా క్యారెక్టర్లకు ఏది అవసరమో అదే చేస్తూ వచ్చాను. నిజం చెప్పాలంటే ‘ఎనర్జిటిక్ స్టార్’ అంటూ నా పేరు ముందు ఓ ట్యాగ్ ఉండటం నాకిష్టం లేదు. కందిరీగ టైంలో నాతో పని చేసిన చాలామంది ఫిలిం మేకర్స్.. నా అభిమానులు.. నా పేరు ముందు ఏదో ఒక ట్యాగ్ ఉండాలని కోరుకున్నారు. వాళ్లను కోరికను కాదనలేక ‘ఎనర్జిటిక్ స్టార్’ అని వేయడానికి ఓకే చెప్పాను. ఐతే ఇప్పుడు మళ్లీ దాన్ని మార్చుకోవాలని.. ‘హైపర్ స్టార్’ అని వేయించుకోవాలని నాకు ఆసక్తి లేదు’’ అని రామ్ అన్నాడు. ఎనర్జిటిక్ స్టార్ అంటున్నారు కాబట్టి.. అందుకోసం ప్రత్యేకంగా ఏమీ చేయనని.. తాను మామూలుగానే ఎనర్జిటిగ్గా ఉంటానని రామ్ చెప్పాడు. పని పట్ల తనకుండే ఉత్సాహమే తెరమీద కనిపిస్తుంది తప్ప ఎనర్జిటిగ్గా కనిపించడానికి చేసేదేమీ ఉండదని రామ్ చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/