ఉన్నది ఒక్కటే సినిమా.. ఇలా అయితే ఎలా?

Update: 2017-10-16 09:35 GMT
ఉన్నది ఒక్కటే జిందగీ.. అంటూ వచ్చేస్తున్నాడు రామ్. ఆ మధ్యన 'నేను శైలజ' సినిమాతో మూస్ సినిమాల నుండి బయటపడి కాస్త కొత్తగా ప్రయత్నిస్తున్నాడు అనుకుంటే.. తరువాత హైపర్ అంటూ మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. అందుకే ఇప్పుడు శైలజను సృష్టించిన డైరక్టర్ కిషోర్ తిరుమలతో కలసి మరోసారి ఇలా విచ్చేస్తున్నాడు. బాగానే ఉంది కాని.. ఇలాంటి సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళాలిగా?

మొన్నామధ్యన విడుదలైన ఈ సినిమా ట్రైలర్ బాగానే ఉందని అనిపించింది. ఫ్రెండ్ అంటే ఎవరు.. లవ్వర్ అంటే ఎవరు.. అనే ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలను కూర్చి.. బాగాఏ ఇంప్రెస్ చేశారు. అయితే ఈ సినిమా అక్టోబర్ 27న మన ముందుకు రానుంది. అంటే ఇంకా 10 రోజులే ఉంది. కాని సినిమా ప్రమోషన్లు మాత్రం పెద్దగా ఎక్కడా కనిపించట్లేదు. మొన్న జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమానికి అందరూ వచ్చేసి ఈ హీరో సూపర్ బంపర్ అంటూ టముకేసినా కూడా.. ఎందుకో అనుకున్నంత అటెన్షన్ మాత్రం రాలేదు. అసలు రామ్ చేతిలో ఉన్నదే ఒక సినిమా. దానిని ఎగ్రెసివ్ గా ప్రమోట్ చేయకపోతే ఎలా? అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

కాకపోతే దీపావళికి చాలా సినిమాలు వస్తున్నాయి కాబట్టి.. అవన్నీ వచ్చేశాక మనోళ్ళు సినిమాను ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారట. విషయం ఏంటంటే.. ఈసారి దీపావళికి శుక్రవారం సెలవ పెడితే నాలుగు రోజుల వీకెండ్ కలిసొస్తోంది. కాబట్టి చాలామంది లాంగ్ ట్రిప్పులు కొట్టేయడానికి రెడీ అవుతున్నారు. అలాంటప్పుడు వారు తిరిగి సోమవారం తరువాత నుండి పనుల్లో బిజీ అయిపోతారు. అందుకే మనోళ్ళు ఇప్పటినుండే ప్రమోషన్లు మొదలెడితే బెటర్.
Tags:    

Similar News