ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన కొత్త లుక్ తో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు. ఈ ఏడాది ఆల్రెడీ ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ తన నెక్స్ట్ సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.
మామూలుగానే బోయపాటి సినిమాలు ఊర మాస్ గా ఉంటాయి. అందుకు తగినట్టుగానే రామ్ కూడా తన లుక్స్ ని సిద్ధం చేసుకుంటున్నాడు. లేటెస్ట్ గా రామ్ విజయవాడ సి.ఎం.ఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి రాగా అక్కడ తన రగ్డ్ లుక్ తో అదరగొట్టాడు. బోయపాటి సినిమాకు కావాల్సిన కటౌట్ ని రెడీ చేసుకునే పనిలో ఉన్నాడు రామ్.
లింగుసామి తో తీసిన ది వారియర్ కూడా భారీ అంచనాలతో రాగా అది కాస్త బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేదు. అందుకే బోయపాటి శ్రీను సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు రామ్. బోయపాటి శ్రీను కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు. రామ్ తో నేషనల్ లెవల్ లో ఆడియన్స్ ని మెప్పించే కథని రాసుకున్నాడట బోయపాటి శ్రీను. అందుకే ఆ కథకి తగిన మాస్ లుక్ కోసం రామ్ ఈ కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు.
మ్యాన్లీ లుక్ తో కనిపిస్తున్న రామ్ ఇదే లుక్ సినిమాలో కొనసాగిస్తే మాత్రం ఓ రేంజ్ లో ఉండబోతుందని చెప్పొచ్చు. రామ్ ఎనర్జీకి బోయపాటి మాస్ డైరెక్షన్ కి కరెక్ట్ సినిమా పడితే మాత్రం ఈ కాంబో మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసే ఛాన్స్ ఉంది. అఖండతో అదిరిపోయే హిట్ అందుకున్న బోయపాటి శ్రీను రామ్ సినిమాను కూడా అదే రేంజ్ అంతకన్నా భారీ హైప్ తో తెరకెక్కిస్తున్నారు.
రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా కథ ఏంటి అన్నది ఇప్పటివరకైతే లీక్ అవలేదు. సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ లుక్ టీజర్ తో సర్ ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నారు మేకర్స్. బోయపాటి టేకింగ్ లో రామ్ మాస్ అటెంప్ట్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి. సినిమా అనుకున్న రేంజ్ లో ఉంటే మాత్రం రామ్ తన గ్రాఫ్ కూడా పెంచుకునే ఛాన్స్ ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.