ఇంతకుముందు కేరళ ప్రభుత్వం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ప్రత్యేకించి తమ సాంప్రదాయ పండగకు ఆహ్వానించి గౌరవించింది. కేరళ వ్యాప్తంగా అసాధారణ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా.. కేరళ వరదల వేళ ఆపత్కాలంలో తనవంతు సాయంతో ఆదుకున్న స్టార్ గా బన్నికి అక్కడ అరుదైన గౌరవం దక్కింది.
అలా ఒక రాష్ట్ర ప్రభుత్వంతో గొప్ప అనుబంధం ఉన్న ప్రఖ్యాత ఆర్గనైజేషన్ రామ్ పోతినేనిని పిలిచి సత్కరించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అత్యున్నత విద్యాసంస్థలో అరుదైన గౌరవాన్ని ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (రాపో) అందుకున్నారు. ప్రతిష్టాత్మక నేపాలీ క్రియేటివ్ యాన్యువల్ కార్యక్రమానికి రామ్ పోతినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రామ్ పోతినేనినే ఎందుకు పిలిచారు? అంటే అతడికి నేపాల్ లో అసాధారణ ఫాలోయింగ్ ఉంది. హిందీ డబ్బింగ్ సినిమాలు చక్కని ఫాలోయింగ్ ని తెచ్చాయి. అతను ఉత్తర భారతదేశంలో నేపాల్ లో.. పొరుగు దేశమైన పాకిస్తాన్ లో కొన్ని ప్రాంతాలలో కూడా ప్రజాదరణ పొందాడు.
రామ్ రెండు హిందీ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ లో 250 మిలియన్లకు పైగా వీక్షణలను పొందాయి. ఇది హిందీ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ సాధించారనడానికి సింబాలిక్. అతడికి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా నేపాల్ ప్రభుత్వ ఆహ్వానం అందింది. రామ్ పోతినేని ప్రతిష్టాత్మక నేపాలీ కార్యక్రమమైన హల్ట్ ప్రైజ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తాజా సమాచారం ప్రకారం.. నేపాల్ వర్చువల్ కార్యక్రమానికి రామ్ హాజరయ్యాడు. హల్ట్ ప్రైజ్ నేపాల్ లో అతిపెద్ద ప్రతిష్టాత్మక వర్చువల్ యువత నేతృత్వంలోని యూనిట్. విద్యార్థులు నోబెల్ ప్రైజ్ గా భావించే హల్ట్ ప్రైజ్.. అర్హతగల విద్యార్థులకు ప్రారంభ పెట్టుబడులను అందిస్తుంది. ఈ కార్యక్రమ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ కి రామ్ పోతినేని ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
గతంలో స్టీవ్ వోజ్నియాక్ .. అలీ జాఫర్ వంటి ప్రముఖ వ్యక్తులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ అత్యున్నత జాబితాలో రామ్ చేరడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏకైక భారతీయ హీరోగా రామ్ కి అరుదైన గౌరవం దక్కింది.