ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు వాళ్ల కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే పెళ్లి చేసుకొని ఆపేస్తారు. ఆ తరువాత మళ్లీ సినిమాలలోకి వస్తే గనక క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేందుకు సిద్దమైపోతారు. ఇక అదే సెకండ్ ఇన్నింగ్స్ తో తమ కెరీర్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతారు. ఈ నేపథ్యంలో తెలుగులో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ ఫేమ్ అందుకున్న బ్యూటీ జెనీలియా. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కుర్రకారుతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను ఫిదా చేసి విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమాలో చేసిన హాసిని క్యారెక్టర్ ఆమెకి ఇంటిపేరులా మారిపోయింది. కర్లీ హెయిర్.. అమాయకమైన చూపులు.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న జెనీలియా.. బాలీవుడ్ హీరో రితేష్ దేష్‌ముఖ్‌తో పెళ్లి తరువాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.
ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఈ జంట.. ఇటీవలే ‘ఇమేజిన్ మీట్స్’ పేరుతో కొత్తగా ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈరోజు జెనీలియా పుట్టినరోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇస్మార్ట్ హీరో రామ్ జెన్నీకి బర్త్ డే విషెస్ తెలిపాడు. ‘నిస్వార్థమైన స్నేహతురాలికి హ్యపీ బర్త్ డే! నీ లైఫ్ లో రానున్న సంవత్సరాలు మరింత ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాను జెన్నూ. త్వరలోనే మనందరం మరోసారి కలుసుకుందాం’ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాక జెనీలియా కుటుంబంతో కలిసి ఉన్న ఫొటోను కూడా షేర్ చేసి సర్ప్రైజ్ చేసాడు. ఆ ఫోటోలో జెనీలియా, ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్, వారి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక రామ్, జెనీలియా కలిసి 2008లో వచ్చిన ‘రెడీ’ సినిమాలో నటించారు. ఆ సినిమా సూపర్ హిట్. అప్పటి నుంచి వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అప్పుడప్పుడు వారిని కలవడానికి ముంబైలోని రితేష్, జెనీలియాల ఇంటికి కూడా రామ్ వెళుతుంటాడట.