దేవదాసు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని కెరీర్ లో విజయలకంటే అపజయాలనే ఎక్కువగా చూస్తున్నాడు. ఏం జరిగినా కెరీర్ ను ఈక్వల్ గా సెట్ చేసుకుంటూ.. వెళుతున్నాడు. చాలా రోజుల తర్వాత నేను శైలజా అనే సినిమాతో హిట్ కొట్టిన రామ్ మళ్లీ హైపర్ తో దెబ్బ తిన్నాడు. ఇక ఈ సారి మళ్లీ హిట్ కొట్టాలని హిట్ ఇచ్చిన దర్శకుడినే నమ్ముకున్నాడు.
నేను శైలజా సినిమాతో హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఇప్పుడు ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమాను చేస్తున్నాడు రామ్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం ఇటలీ లో షూటింగ్ జరుపుకుంటోంది చిత్ర యూనిట్. ఆ షెడ్యూల్ అయిపోగానే హైదరాబాద్ కి వచ్చి చిత్రం యొక్క రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారట. ఈ సినిమా అక్టోబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది.
ఇక ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ తో పాటు లావణ్య కూడా నటిస్తోంది. శ్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రామ్ ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు