పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ''వకీల్ సాబ్'' సినిమాకి ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి పాటలు రాస్తున్న సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సారధ్యంలో ఇప్పటి వరకు విడుదలైన రెండు గీతాలకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. 'మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. నీ సహనానికి సరిహద్దులు కలవా' అంటూ మహిళల గొప్పదనాన్ని తెలుపుతూ ఆయన రాసిన ఫస్ట్ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో లేటెస్టుగా 'సత్యమేవ జయతే' అనే రెండో పాటను విడుదల చేశారు. శ్రోతలను విశేషంగా అలరిస్తోన్న ఈ పాటను మెగాస్టార్ చిరంజీవికి రామజోగయ్య వినిపించినట్లు తెలుస్తోంది.
'జన జన జన జనగమున కలగలిసిన జనం మనిషి రా.. మన మన మన మనతరపున నిలబడగలిగే నిజం మనిషి రా' అంటూ పవన్ కళ్యాణ్ ని దృష్టిలో ఉంచుకుని రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ గీతాన్ని రామజోగయ్య ఇప్పటికే చిరంజీవికి వినిపించినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ''నిండుగా నమస్కరించి కృతజ్ఞతలు చెప్పుకుని…. సమక్షంలో…సత్యమేవజయతే వినిపించాను… పండగ రోజు... మనసున్న మారాజు మా కొణిదెల చిరంజీవి గారు. MEGASTAR for a REASON'' అంటూ రామజోగయ్య ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవితో ఆయన తీసుకున్న ఓ ఫోటోని ఫాలోవర్స్ తో పంచుకున్నారు.