వాతావరణం ప్రశాంతంగా ఉంటే కొందరికి అస్సలు నచ్చదు. నిత్యం ఏదో అశాంతితో రగిలిపోతూ ఉంటే సమ్మగా ఉంటుంది. అలాంటి వ్యక్తిత్వాలు సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. రీల్ లైఫ్ కు తగ్గట్లే రియల్ లైఫ్ లోనూ కొన్ని క్యారెక్టర్లు కనిపిస్తుంటాయి. అలాంటి తరహాలోనే చెప్పాలి వర్మ గురించి చెప్పాల్సి వస్తే.
మనసుకు ఏం అనిపిస్తే అదే చెబుతుంటానని చెప్పే వర్మ.. తన మాటల కారణంగా చోటు చేసుకునే పరిణామాలకు తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అలా అని అన్ని విషయాలు అంతే ఓపెన్ గా చెబుతారా? అంటే అదీ ఉండదు. ఎక్కడిదాకానో ఎందుకు ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ప్రశ్న అడిగితే.. సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిందని చెబుతారు. మరి.. ఆ సాంకేతిక కారణాలేంటో విప్పి చెప్పొచ్చుగా. కానీ.. చెప్పరు. అంతే.. వర్మకు ఏది చెప్పాలి? ఎంత చెప్పాలి? అన్న విషయంలో విచక్షణ ఉన్నట్లేనని చెప్పక తప్పదు.
మరి.. అన్ని తెలిసిన వర్మ.. పవన్ కల్యాణ్ మీదా.. మెగా ఫ్యామిలీ మీద అదే పనిగా ఎందుకు ట్వీట్లు చేస్తుంటారు? ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నా.. మెగా ఫ్యామిలీని కెలికినంత ఎక్కువగా మరెవరినీ కెలకలేదన్న మాట పలువురి నోటి వెంట వినిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యన శ్రీరెడ్డి ఎపిసోడ్.. ఆమె చేసిన వ్యాఖ్యల్లో తన ప్రమేయాన్ని ఓపెన్ గా చెప్పిన వర్మ పుణ్యమా అని టాలీవుడ్‌లో భారీ రచ్చే జరిగింది.
దీనికి సంబంధించిన చాలా విషయాలు గుట్టుగా ఉండిపోయాయే కానీ.. వాటిని బయట పెట్టేందుకు మీడియా సంస్థలన్ని వెనక్కి తగ్గాయి. ఎందుకంటే.. ఇష్యూలను అదే పనిగా కెలకటం ద్వారా లేనిపోని ఇబ్బందులు ఎదురుకావటం.. విపరిణామాలకు దారి తీయటం జరుగుతోంది.
అయితే.. ఆ విషయాన్ని తరచూ మర్చిపోతూ.. ఎప్పటికప్పుడు తన ట్వీట్లలో వివాదాల్ని.. సంచలనాలకు తెర తీయటం వర్మలో కనిపిస్తుంది. తాజాగా.. జనసేన అధినేత పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. రవితేజ నటించిన నేల టికెట్ సినిమాకు సంబంధించిన కార్యక్రమంలో పవన్ ఏదో చేశారంటూ ఒక వీడియో క్లిప్ ను పెట్టి.. ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటాన్ని పలువురు తప్పు పట్టారు.
రవితేజ తొడ మీద పవన్ చేయి వేయటం.. జనసేనాధినేతలోని ఈ యాంగిల్ అటు పార్టీ వారికి.. ఇటు మెగా ఫ్యామిలీకి తెలీదంటూ చౌకబారు ట్వీట్లు చేయటం పెను దుమారమే రేగుతోంది. ఇదిలా ఉంటే.. తిరుమలకు కాలినడకన వెళ్లిన పవన్.. మెట్ల మార్గంలో అలసటతో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ ఫుల్ ఎనర్జీకి ఇది నిదర్శనమంటూ ట్వీట్ చేయటంపై పలువురు మండిపడుతున్నారు.
ఈసారి సామాన్యులే కాదు.. సినీ ప్రముఖులు కూడా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా వర్మ చేసిన ట్వీట్ పై సినీ గేయ రచయిత రామజోగయ్య స్పందిస్తూ.. కెలకమాకు సామీ అంటూ వర్మకు ట్వీట్ చేశారు. తెలుగువాళ్ల సమయం వృథా చేయొద్దని.. అంతగా ఏమైనా ఉంటే పవన్ కల్యాణ్ కు పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడుకోవాలని సూచించారు. నిజమే.. వర్మకు అనిపించే పర్సనల్ ఫీలింగ్స్ ను పబ్లిక్ డొమైన్లో పెట్టి రచ్చ చేయటం ఎందుకు.. అదేదో పవన్ కు.. తనకు తెలిసిన పది మందికి పర్సనల్ గా ఫోన్లు చేసి మరింత విచ్చలవిడిగా మాట్లాడేయొచ్చు కదా?