టాలీవుడ్ లో ప్రస్తుతం ఫేమస్ పాటల రచయిత ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో రామ జోగయ్య శాస్త్రి పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆయన కెరీర్ ప్రస్తుతం చాలా జోష్ మీద సాగుతోంది. ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సింగిల్ కార్డ్ రచయితగా నిలిచారు. కొన్ని వేల కొద్ది పాటలను రాసి వందల కొద్ది సూపర్ హిట్స్ ను అందుకున్న ఘతన దక్కించుకున్నాడు.
ఇండస్ట్రీలో రామ జోగయ్య శాస్త్రి అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయ్యింది. ఆయన సక్సెస్ లో ప్రతి ఒక్క పాట కూడా కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. అయితే ఆయన తనకు మొదట అవకాశం ఇచ్చిన దర్శకుడిని మర్చి పోకుండా.. తనకు లైఫ్ ఇచ్చిన సినిమా ను మర్చి పోకుండా ప్రత్యేక సందర్బంలో ఆ సినిమా మరియు దర్శకుడిని తల్చుకున్నాడు.
మంచు విష్ణు హీరోగా జెనీలియా హీరోయిన్ గా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇప్పటికి కూడా ప్రేక్షకుల అభిమానంను దక్కించుకుంటున్న 'ఢీ' సినిమా విడుదల అయ్యి 15 సంవత్సరాలు పూర్తి అయ్యింది.
దాంతో సోషల్ మీడియా లో ఆ హడావుడి కనిపిస్తుంది. ఆ సినిమా తోనే రామ జోగయ్య శాస్త్రి ఎంట్రీ ఇచ్చారు.
ఢీ సినిమాకు 15 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా రామ జోగయ్య శాస్త్రి స్పందించారు. ఆయన ట్విట్టర్ లో తనకు శ్రీను వైట్ల ఇచ్చిన అవకాశం పై మరియు ఆయన తనను నమ్మడం వల్లే ఈ స్థాయిలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. కెరీర్ లో ఎంతో మంది తన ఎదుగుదలకు దోహద పడ్డారు. కాని మొదటి అవకాశం ఇచ్చింది మాత్రం శ్రీనువైట్ల అన్నట్లుగా శాస్త్రి గారు ట్వీట్ చేశారు.
ఆయన ట్విట్టర్ లో... థ్యాంక్యూ డియర్ శ్రీనువైట్ల... నేనింతవరకూ రావడంలో మీ పాత్ర మరువలేనిది...తొలిరోజుల్లో ఒక ప్రతిభను గుర్తించడం నమ్మడం మీరు నాకు చేసిన మేలు..ఢీ...నామట్టుకు నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం..మన టీమ్ అందరికీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. శ్రీనువైట్ల ఈమద్య కాలంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ లను దక్కించుకోలేక పోతున్నాడు. మళ్లీ ఆయన కెరీర్ గాడిలో పడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.