దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ - ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అజయ్ దేవగన్ - శ్రియా - సముద్రఖని - అలిసన్ డూడీ - రే స్టీవెన్ సన్ ఈ మూవీలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో 'కొమురం భీమ్'గా తారక్.. 'అల్లూరి సీతారామరాజు'గా చరణ్ నటిస్తున్నారు. 'ఆర్.ఆర్.ఆర్' నుంచి ఇద్దరు హీరోలకు సంబంధించిన ఇంట్రో వీడియోలు విడుదలయ్యాయి. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాకి ఈ వీడియోలు మరింత హైప్ ని తీసుకొచ్చాయి. అదే సమయంలో ఎన్టీఆర్ - చరణ్ లుక్స్ ని బట్టి జక్కన్న ఏమి చెప్పబోతున్నాడో అని అందరూ ఆలోచిస్తున్నారు.
చరిత్ర ప్రకారం తెలంగాణకు చెందిన విప్లవవీరుడు కొమురం భీమ్ మరియు ఆంధ్ర ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ఎప్పుడూ ఒకరినొకరు కలుసుకోలేదు. కానీ ఇప్పుడు రాజమౌళి వీరిద్దరినీ ఒకచోట చేర్చి స్టోరీ చెప్పబోతున్నాడు. నిజానికి రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇదొక ఫిక్షనల్ స్టోరీ అని.. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ కొన్ని రోజులు కనిపించకుండా పోయిన పీరియడ్ లో ఇద్దరూ కలిసి పోరాడితే ఎలా ఉంటుందనే ఐడియా ఇదని.. దేశభక్తి కంటే వారి మధ్య ఉండే స్నేహం గురించి ప్రధానంగా చెప్పబోతున్నానని చెప్పుకుంటూ వచ్చాడు. అందులోనూ 'భీమ్ ఫర్ రామరాజు'లో చరణ్ ని పోలీసుగా చూపించిన రాజమౌళి.. 'రామరాజు ఫర్ భీమ్' వీడియోలో తారక్ ని ఒక ముస్లిమ్ యువకుడిగా చూపించాడు. ఇద్దరినీ యుద్ధవీరులుగా చూపిస్తూ రామరాజు - భీమ్ సోదరభావంతో మెలుగుతుంటారనే విషయాన్ని టీజర్స్ తో వెల్లడించారు.
అంతేకాకుండా చరణ్ ని నిప్పుల్లో చూపించిన రాజమౌళి.. ఎన్టీఆర్ ని నీళ్లలో చూపించాడు. రెండు వీడియోలలో ప్రతి ఫ్రేమ్ లో నీటికి నిప్పుకి ప్రతీకగా నిలిచే షాట్స్ తో వేరియేషన్ చూపించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో కూడా ఈ తేడా స్పష్టంగా కనిపించేలా డిజైన్ చూపించాడు. దీంతో ఎవరూ ఊహించనిది తెరపై చూపించే జక్కన్న ఈసారి ఏం చెప్పబోతున్నాడో అని అందరికి ఆత్రుత మొదలైంది. ఏదేమైనా స్టోరీ టెల్లింగ్ లో మాస్టర్ అనిపించుకున్న రాజమౌళి.. 'ఆర్.ఆర్.ఆర్' లో కూడా అందరిని మెప్పించే విధంగా తెరపై ప్రెజెంట్ చేయబోతున్నాడనేది మాత్రం స్పష్టం అయింది. దర్శకధీరుడు సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరించే ఈ విజువల్ వండర్ ని చూడాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.